మెగాస్టార్ కి, ఏఅర్ రెహమాన్ కి ఏంటి గొడవ?     2017-10-03   23:40:09  IST  Raghu V

సైరా నరసింహారెడ్డి … బాహుబలి తరువాత బాహుబలి అంతటి ప్రాజెక్టు. దీన్ని దేశవ్యాప్తంగా ఓ సంచలనం చేయాలని కంకణం కట్టుకున్నారు మెగాస్టార్. అందుకు తగ్గట్టుగానే ఇటు దక్షిణాది ఇండస్ట్రీల నుంచి, అటు బాలివుడ్ నుంచి తారలను తీసుకొచ్చి తమ ప్రాజెక్ట్ లో పెట్టుకున్నారు. తమిళం నుంచి విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరో, లేడి సూపర్ స్టార్ నయనతార, కన్నడ నుంచి సుదీప్, ఇక బాలివుడ్ నుంచి అయితే ఏకంగా అమితాబ్ బచ్చన్ ఈ భారి బడ్జెట్ సినిమాలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ అంటే, నిజంగానే భారి బడ్జెట్. వంద కోట్లు కాదు, 180 కోట్లకు పైగా ఖర్చుపెట్టి దీన్ని మరో బాహుబలి చేయాలని చూస్తున్నారు. ఈ 180 కోట్లు కాలక్రమంలో 200 కోట్లు దాటినా దాటోచ్చు.అంతా బాగానే ఉన్నా, జాతీయ ప్రాజెక్ట్ కి జాతీయస్థాయి మ్యూజిక్ డైరక్టర్ అవసరమని ఎఆర్ రెహమాన్ ని పట్టుకొస్తే, ఆయనేమో చుక్కలు చూపిస్తున్నాడు. ఆయన బిజీ షెడ్యూల్ వలన దొరక్కపోతేనే, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి తమన్ చేత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు. ఇంతవరకు సైరా నరసింహారెడ్డి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవలేదు అంట. మొత్తానికి చిరంజీవి, రామ్ చరణ్, సురేందర్ రెడ్డి లకి, ఎఆర్ రెహమాన్ కి మధ్య ఎదో జరిగింది. అదేమిటి అనేది బయటకి రావడం లేదు.

మరి వీళ్ళు ఇస్తానన్న రెమ్యూనరేషన్ నచ్చలేదో, ఎక్కువ పని అడిగేసారో తెలియదు కాని, రెహమాన్ ఈ సినిమా నుంచి బయటకి వెళ్ళే దిశగా అడుగులు వేస్తున్నారు. అదే జరిగితే, ఈ సినిమాకి సంగీతం అందించే అవకాశం ఎవరికీ దొరుకుతుందో మరి. అదృష్టం బాగుంటే, తమన్ కే అవకాశం దక్కవచ్చు.