బేసిగ్గా ఇన్విటేషన్ అందకుండా ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్లడం, అక్కడ భోజనం చేయడం అనేది చాలా సాధారణమైన విషయం.అయితే అలాంటి చర్యలు చట్ట ప్రకారం నేరం అని మీకు తెలుసా? ఇక్కడ ఓ హాస్టల్ విద్యార్థుల( hostel students ) బృందం ఆహ్వానం లేకుండా వివాహ వేడుకకు వెళ్లడమే కాకుండా, అక్కడ వారు ప్రశ్నించిన పాపానికి వారి పెళ్లి ఇంటిని ధ్వంసం చేయడం చర్చనీయాంశం అయింది.అయితే ఆహ్వానం లేకుండా ప్రైవేట్ కార్యక్రమాలు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్లి ఉచితంగా లభించే విలాసవంతమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు మనలో కొంతమంది.కానీ ఇలా ఐతే చేయనే చేయరు.
విషయంలోకి వెళితే… ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ( Lucknow, Uttar Pradesh )ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.అక్కడి హసన్‌గంజ్‌లోని రామ్‌దిన్ మ్యారేజ్ లాన్‌లో ( Ramdin Marriage Lawn, Hassanganj )జరుగుతున్న వివాహ వేడుకకు భోజనానికి వచ్చిన విద్యార్థుల బృందం అతిథులపై రాళ్లు, ముడి బాంబులతో దాడి చేసి నానా రభస చేశారు.పోలీసుల కథనం ప్రకారం.విద్యార్థులను ప్రశ్నించే విషయంలో వాగ్వాదం జరిగినట్టు సమాచారం.ఈ హింసలో దాదాపు 20 మంది అతిథులు గాయపడినట్టు తెలుస్తోంది.రెండు వైపుల నుంచి ఫిర్యాదులు అందడంతో హస్సంగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనీషా సింగ్ ( Deputy Commissioner of Police Manisha Singh )తెలిపారు.
పోలీసుల భద్రత నడుమ సదరు పెళ్లి తంతు జరగడం కొసమెరుపు.ఈ క్రమంలో 3 వేల మందికి విందు సిద్ధం చేసినా.గందరగోళం కారణంగా ఎవరూ మనస్ఫూర్తిగా భోజనం చేయలేకపోయారు.దాంతో పెళ్లికి వచ్చిన అతిథులు కొంతమంది భోజనం చేయకుండానే వెనుదిరిగారు.పెళ్లికి ఆహ్వానం లేకుండా దాదాపు 150 మంది విద్యార్థినులు అక్కడికి వెళ్లి అక్కడ రభస చేసారని వినికిడి.కాగా హేట్ డిటెక్టర్స్ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో పెళ్లి మండపంలో బాలి విద్యార్థులు పెళ్లికి వచ్చిన అతిథులపై రాళ్లు రువ్వుతున్న దృశ్యం వైరల్ అవుతోంది.
ఆనందంగా సాగుతున్న పెళ్లిలో విద్యార్థినులు ఇలా దురుసుగా ప్రవర్తించడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.