వాట్సాప్ నయా ఫీచర్.. సింగిల్ క్లిక్ తో చాట్ హిస్టరీ ట్రాన్స్ఫర్..!

నేటి రోజులలో అనేక మంది వాట్సాప్ ను బాగా వినియోగిస్తున్నారు.పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరూ కూడా వాట్సాప్ ను వాడుతున్నారు.

 What's Up, New Features, Chat History, Transfer, Latest Updates,ios To Android-TeluguStop.com

మెస్సేజులు, వీడియోలు షేర్ చేసుకుంటూ గ్రూప్ లు క్రియేట్ చేసుకుని తమ సందేశాలను వినిపించడానికి వాట్సాప్ అనేది అతి సులభమైన యాప్.మరి ఇటువంటి వాట్సాప్ తమ వినియోగదారుల కోసం అనేక ఫీచర్లను తీసుకొస్తుంటుంది.

తాజాగా ఈ వాట్సాప్ ఓ అద్బుతమైన ఫీచర్ ను యూజర్లకు అందించింది.ఆ ఫీచర్ ఏంటంటే.

వాట్సాప్ చాట్ హిస్టరీ ట్రాన్స్ఫర్ ఫీచర్.ఒకే ఒక క్లిక్ తో మీ డేటాను సులభంగా ట్రాన్స్ఫర్ చేసేయవచ్చు.

ఒక డివైజ్ లోని డేటాను వేరే డివైజ్ లోకి మార్చుకోవచ్చు.ఒకవేళ మీరు కనుక ఐఓఎస్ అనే డివైజ్ ను వినియోగిస్తున్నట్లైతే దానిని ఆండ్రాయిడ్ డివైజ్ లోకి అతి సులభంగా బదిలీ చేసేయవచ్చు.

Telugu Chat, Latest Ups, Transfer, Whats-Latest News - Telugu

గతంలో అయితే మనం వాట్సాప్ డేటాను వేరే డివైజ్ లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని యాప్స్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది.ఇలా థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో డేటాను బదిలీ చేసుకునేవాళ్లం.అయితే వేరే డివైజ్ లోకి డేటా అనేది డౌన్లోడ్ చేసి బదీలు చేసే అవకాశం అనేది ఉంటుంది.దీని వల్ల మీ డేటా అనేది లీక్ అయినా అవ్వచ్చు.

లేకుంటే ఆ డేటా అనేది పూర్తిగా డిలీట్ అవ్వను కూడా అవ్వచ్చు.అందుకే వాట్సాప్ తమ వినియోగదారుల కోసం అద్బుతమైన ఫీచర్ ను తీసుకొచ్చింది.

అదే చాట్ ట్రాన్స్ఫర్ ఫీచర్.ఈ రకం ఫీచర్ వలన వినియోగదారులు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు అతి సులభంగా వాట్సాప్ చాట్ డేటాను ట్రాన్స్ఫర్ చేసేయవచ్చు.

అయితే ఈ ఫీచర్ అతి కొద్ది మందికే ఇది అందుబాటులోకొచ్చింది.అతి త్వరలోనే ఈ ఫీచర్ వాట్సాప్ వినియోగదారులకు అందరికీ చేరువకానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube