ఇదేం, వెడ్డింగ్ షూట్ అయ్యా బాబు.. ఒంటికి నిప్పు పెట్టుకొని అరాచకం!

ఈ రోజుల్లో వధూవరులు ఫ్రీ వెడ్డింగ్ షూట్, వెడ్డింగ్ షూట్ పేరిట రకరకాల ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు.కొందరు బురదలో దొర్లడం, మరికొందరు అర్థనగ్నంగా నిల్చుని ఫొటోలు దిగడం వంటి విపరీతమైన ట్రెండ్స్ మనం చూస్తూనే ఉన్నాం.

 What S This Wedding Shoot , Umber, Gabe,weeding Shoot , Viral Latest , Viral News , Social Media , Viral Video , Fire ,pre Wedding Shoot-TeluguStop.com

తాజాగా ఈ ట్రెండ్ లో మరొక వింత వెలుగు చూసింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో నూతన దంపతులు తమ ఒంటికి, బట్టలకు నిప్పంటించుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.అయితే వాళ్లు ఏం ట్రిక్ ఉపయోగించారో తెలియదు కానీ వారికి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు.

 What S This Wedding Shoot , Umber, Gabe,Weeding Shoot , Viral Latest , Viral News , Social Media , Viral Video , Fire ,pre Wedding Shoot-ఇదేం, వెడ్డింగ్ షూట్ అయ్యా బాబు.. ఒంటికి నిప్పు పెట్టుకొని అరాచకం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది చూసిన నెటిజన్లు ఇదేందయ్యా ఇది.ఇదేం, వెడ్డింగ్ షూట్ అయ్యా బాబు. ఒంటికి నిప్పు పెట్టుకొని అరాచకం సృష్టించాలా అని కామెంట్లు పెడుతున్నారు.ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఇప్పుడు దానికి వేలల్లో వ్యూస్ వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే. అంబైర్, గేబ్ అనే ప్రేమికులు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.

వీళ్ళిద్దరూ స్టంట్ చేయడంలో వారికి వారే సాటి.అయితే తమ పెళ్లిలో కూడా ఏదో ఒక స్టంట్ చేయాలనుకున్నారు.

ఈ ఆలోచన నుంచే ఒంటికి, తమ బట్టలకు నిప్పు పెట్టుకోవడం పుట్టుకొచ్చింది.ఇదే ఆలోచనను వారు నిజం చేసి అందరినీ నివ్వెరపరుస్తున్నారు.

ఇదే సమయంలో ఏదైనా తేడా జరిగితే శుభకార్యం కాస్త తీవ్ర నిరాశ మిగిల్చేది.

అయితే ఎలాంటి గాయాలు కాకుండా మంటలు ఆర్పే ఫైర్ ఎక్స్ట్రింగిషర్లు ముందు జాగ్రత్తగా అందుబాటులో ఉంచుకున్నారు.వధువు విగ్ ధరించి దానికి మంట అంటుకోకుండా ఒక జల్ అప్లై చేసింది.స్టంట్ అయిపోయాక ఈ మంటలారిపే సాధనాలను ఉపయోగించి ఇద్దరు సహాయకులు వీరి మంటలను ఆర్పివేశారు.

అయితే ఇంత రిస్కు అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.పిచ్చి పీక్స్ కి వెళ్ళడం అంటే ఇదేనని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇలాంటి స్టంట్ చేస్తున్నప్పుడు అపశృతులు జరిగే ప్రమాదం ఎక్కువ.మరి కొందరు మాత్రం ఇది చాలా బాగుందని వధూవరులను పొగుడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube