Rithuu Chowdary : నువ్వు పెట్టిన క్యాప్షన్ ఏంటి పంపిన ఫోటో ఏంటి.. రీతూ చౌదరీపై నెటిజన్స్ ఫైర్?

బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా స్టార్ రీతూ చౌదరి( Rithu Chowdary ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ బుల్లితెరపై తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకొని ఒక ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 Whats The Caption You Posted And Whats The Photo You Sent Netizens Fire On Ritu-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది.తన ఫోటోలతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది.

Telugu Gym, Inti Guttu, Jabardasth, Nana, Rithu Chowdary, Serial Actress-Movie

రీతూ చౌదరి మొదట్లో డబ్స్మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేసి అందర్నీ ఆకట్టుకుంది.ఆ తర్వాత యూట్యూబ్ లలో కొన్ని షార్ట్ వీడియోలు చేసి అందులో కూడా తన నటనకు గుర్తింపు తెచ్చుకుంది.అలా ఆమెకు వెండితెరపై సైడ్ ఆర్టిస్టులాగా అవకాశం వచ్చింది.అంతేకాకుండా బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశం కూడా రావడంతో బుల్లితెరపై బాగా దూసుకెళ్లింది.అలా గోరింటాకు సీరియల్ లో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Telugu Gym, Inti Guttu, Jabardasth, Nana, Rithu Chowdary, Serial Actress-Movie

ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది.సీరియల్ నటిగా తనకు మంచి పేరు వచ్చింది.ఇక కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.

ఇక తను కూడా బాగా కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.జబర్దస్త్ లో తోటి కమెడియన్స్ తో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

ఓవైపు సీరియల్స్, మరోవైపు కామెడీ షో లతో బాగా బిజీగా మారింది.ఇక తీరిక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత హల్ చల్ చేస్తుంది.

ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ.సీరియల్ టైం లో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

అలా సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.

పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా షో చేస్తుంది.ఈమె తండ్రి కూడా ఈమెతో చాలా రీల్స్ చేశాడు.అవి కూడా బాగా క్లిక్ అయ్యేవి.అలా తన తండ్రిని కూడా సోషల్ మీడియా ప్రియులకు పరిచయం చేసింది రీతూ చౌదరి.

అయితే ఇటీవలే తన తండ్రి మరణించిన సంగతి తెలిసిందే.దీంతో ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ బాగా ఎమోషనల్ అయింది రీతూ.

పైగా తన తండ్రి సోషల్ మీడియా ప్రియులకు పరిచయం ఉండటంతో సోషల్ మీడియా ప్రియులు కూడా తన తండ్రి మరణించిన విషయాన్ని తట్టుకోలేక పోయారు.

Telugu Gym, Inti Guttu, Jabardasth, Nana, Rithu Chowdary, Serial Actress-Movie

ఇక ఆమె పోస్ట్ చేసిన ప్రతిసారి ఆమెకు ధైర్యం ఇస్తూ ఉన్నారు.అయితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకోగా అందులో తను జిమ్ లో ఉన్నట్లు కనిపించింది.ఇక ఆ ఫోటోకు ఐ మిస్ యు నాన్న అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇక ఆ ఫోటోకు ఆమె ఇచ్చిన ఫోజు కు క్యాప్షన్ కు సంబంధం లేకపోయేసరికి అందరూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube