ఆ సర్వేలో ఏముంది ? ఈ సర్వేలో ఏముంది ? లెక్కలు తేల్చేస్తున్న బాబు  

What\'s In That Survey? Launches Calculations-

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు గెలుపు లెక్కలు వేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు. ఒక పక్క సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రిపోర్ట్స్ తెప్పించుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూనే మరోపక్క వివిధ సర్వేలకు సంబంధించి రిపోర్ట్స్ ను బేరీజు వేసుకుంటున్నాడట. ఇక ఎన్నికల ఫలితాల గురించి ఎక్కడ మాట్లాడవలసి వచ్చినా గెలుపు తమదే అంటూ ధీమాగా చెప్తున్నాడు..

ఆ సర్వేలో ఏముంది ? ఈ సర్వేలో ఏముంది ? లెక్కలు తేల్చేస్తున్న బాబు-What's In That Survey? Launches Calculations

కాకపోతే గెలుపుపై బాబు లో మాత్రం ఇంకా అనుమానాలు తగ్గలేదు.ఇక పార్టీ నేతలు మరి కొందరయితే బాబు ని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు కొందరు తాము గెలవబోతున్నాము అంటూ ఆ తాలూక సర్వేలను బాబు కి సమర్పిస్తున్నారు.

అయితే బాబు కి అందిన సర్వేల రిపోర్ట్స్ ని బాబు ఆసక్తిగా చదువుతూ ఆ సర్వేల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషించే పనిలో పడ్డాడట.

ఈ వ్యవహారంపై కొందరు తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు స్వయంగా తాను చేయించుకున్న సర్వే ప్రకారం విజయం తమదే అంటూ చెబుతున్నారని, ఇప్పుడు కొందరు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేలకు బాబు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బాబు కి గెలుపు పెద్దగా ధీమా లేనందునే అంత ఆసక్తిగా ఈ సర్వేలను చదువుతున్నారని అంటున్నారు.

ఇక బాబు మాత్రం ఖచ్చితమైన ఫలితాలను తెలుసుకునేందుకు అన్నిరకాలుగాను ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో టీడీపీకి, తనకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులను కూడా పరిగణలోకి తీసుకోవాలని వీటి ద్వారా కూడా టీడీపీకి ఏ మేరకు అవకాశం ఉందో చూడాలని టీడీపీ ఐటీ వింగ్ కి బాబు ఆదేశాలు జారీ చేసాడట. అలాగే ఈసారి ఎన్నికలలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసినందున పార్టీ నాయకులు చాలా మందికి అవకాశాలు దక్కాయని, పెద్దగా అసంతృప్తులు కూడా ఎక్కడా తలెత్తలేదని, ఇవన్నీ టీడీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని బాబు అంచనా వేస్తున్నాడు. ఇక జనసేన పార్టీ వల్ల తమ ప్రత్యర్థి వైసీపీ కంటే తామే ఎక్కువ నష్టపోయామనే భావనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది.