శబరిమలలో ఏం జరగబోతోంది..?     2018-10-16   14:14:57  IST  Sai Mallula

శబరిమలలో టెన్షన్ కొనసాగుతోంది… రేపు ఆలయం తెరవనుండడంతో ఆలయంలో లోపలికి వెళ్తామని కొందరు మహిళలు ఇప్పటికే ప్రకటించారు. అయితే వారిని అనుమతిస్తే ఆత్మహత్య చేసుకుంటామని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఈ పోటాపోటీ ప్రకటనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు కేరళ సీఎం పినరయి విజయన్‌.

What's Going On Tomorrow In Sabarimala-

What's Going On Tomorrow In Sabarimala

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎలాంటి రివ్యూ పిటిషన్ వేసేది లేదని స్పష్టం చేశారు. అటు తాజా పరిస్థితులపై చర్చించేందుకు ట్రావెన్ కోర్‌ బోర్డు సమావేశం కానుంది.