అసలు ఆ వసతి గృహాల్లో ఏం జరుగుతోంది ...! మరి ఇంత దారుణమా ...?

రోజూ రోజుకి సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ఆడపిల్లల్ని బైటికి పంపించాలంటే భయంతో వణికిపోతున్నారు.వసతి గృహంలో ఉన్న బాలికలు గర్భం దాల్చడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

 Whats Going In That Hostel, What's That Much Worse, Up, Yogi Adityanath, Hostels-TeluguStop.com

ఇంతటి అమానుషం ఎలా జరిగింది అని సీఎం స్థాయి నుంచి విచారణ మొదలైంది.దీనికి తోడుగా అందులో ఒకరికి హెచ్ఐవి సోకడం మరింత అనుమానాలు రేకెత్తిస్తుంది.

ఇంతటి అమానుషం ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా.!

వసతి గృహాల్లో ఆడ పిల్లల నుంచి తల్లిదండ్రులకి భయం రేకెత్తించే ఒక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.కాన్పూర్ ఆశ్రయ గృహంలో 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్ తేలింది.వారిలో 5 మంది గర్భం దాల్చారని తేలడం కలకలం రేపుతోంది.ఇందులో ఒకరికి హెచ్ఐవి కూడా సోకింది.

ఈ దారుణమైన విషయం తెలిసిన ఉన్నత అధికారులు ఆశ్రయానికి తాళం వేసి సీజ్ చేశారు.దీనిపై కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ బ్రహ్మ డియో రామ్ తివారీ మాట్లాడుతూ… వివిధ జిల్లాలోని శిశు సంక్షేమ కమిటీల సిఫార్సు మేరకు బాలికలను ఆశ్రయానికి తీసుకొచ్చారని తెలిపారు.

అప్పటికే కొంతమంది గర్భవతులుగా ఉన్నారని వెల్లడించారు.దీనిపై దర్యాప్తు జరుగుతుందన్నారు.

Telugu Corona, Hostels, Kanpure Medical, Yogi Adityanath-General-Telugu

వీరందరూ కాన్పూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది.డిసెంబర్ 2019 ఇద్దరు బాలికలు ఆగ్రా నుంచి వచ్చారని కాన్పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ తెలిపారు.అయితే.చాలా మంది ఆశ్రయంలో ఉన్న వారు గర్భవతులుగా ఉన్నారని వదంతులు వ్యాపించాయి.ఇది నిజం కాదని కొట్టిపారేశారు దినేష్ కుమార్.ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేయడం జరుగుతోందని, రెండు నెలల్లో ఎవరు వచ్చారు …? ఎక్కడకు వెళ్లారు .? వీరికి కరోనా వైరస్ ఎలా సోకిందనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు.నివాసంలోకి మగవారిని అనుమతించమని, కానీ అప్పటికే బాలికలు గర్భవతులయ్యారని యూపీ ఉమెన్స్ కమిషన్ మెంబర్ పూనమ్ కపూర్ తెలిపారు.

దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube