జగన్ - పవన్ లకు ఏమైంది ...? రాయబారం బెడిసికొట్టిందా ..?

ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వారి వారి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ వైరం కొనసాగుతోంది.నిన్నా… మొన్నటి వరకు ఈ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురిస్తోందని కొత్త పొత్తులు విచ్చుకుంటాయని అంతా భావించారు.కానీ అవి ఎంతవరకు వచ్చాయో పూర్తి స్థాయిలో తేలకుండానే ఈ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరిపోయింది.

 Whats Going In Between Pawan Kalyan And Ys Jagan-TeluguStop.com

ఇంతకాలం ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఉతికి ఆరేసిన పవన్‌… ఇప్పుడు జగన్‌పై మాటల దాడి పెంచేసాడు.కోడికత్తి దాడితో పాటు హోదా విషయంలో వైసీపీ పారిపోయింది అంటూ పవన్ విమర్శలు గుప్పిస్తున్నారు.దీంతో… వైసీపీ, జనసేనల మధ్య పొత్తుల రాయబేరం బెడిసి కొట్టిందా ? ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదా అనే అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రత్యర్థులైన వైసీపీ , జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.ప్రతిపక్షనేత వైఎస్ జగన్ టార్గెట్‌గా పవన్ విమర్శలకు పదును పెట్టారు.ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మోస్తున్న పవన్ .అసలు అజెండా చెప్పాలంటూ వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు.దీంతో… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా… రూటు మార్చారు.ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ టార్గెట్‌గా విమర్శలు గుప్పించిన ఆయన తాజాగా .ప్రతిపక్ష నేత జగన్‌పై మాటల దాడికి దిగారు.ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ ప్రధానంగా జగన్‌నే టార్గెట్‌ చేసుకున్నారు.కోడికత్తి నుంచి ప్రజా సంకల్పయాత్ర వరకు ఒక్కో అంశాన్ని చెబుతూ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్థ్రాలు వదులుతున్నాడు.

ఆఖిరికి జగన్ కులం పేరుతో సహా విమర్శించే స్థాయికి పవన్ వెళ్ళిపోయాడు.

పవన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.ఇదేనా మీరు చెబుతున్న కులతత్వ సమాజం ఇదేనా అంటూ సూటిగా ప్రశ్నించారు.రోజుకో మాట పూటకో బాట పట్టే పవన్ … తమ అధినేతను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.2009లోనూ ఇదే తరహాలో స్ధాయికి మించి విమర్శలు చేసి నవ్వుల పాలైన విషయం గుర్తుంచుకోవాలంటూ సూచించారు.వైసీపీ, జనసేనల మధ్య మాటల మంటలపై టీడీపీ ప్రస్తుతానికయితే సైలెంట్ గానే ఉంది.

ఈ రెండు పార్టీలు తగువులాడుకుంటూ ఉంటే అది తమకే లాభమని… టీడీపీ సంబరపడుతోంది.అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు విచ్చుకోవని టీడీపీ వాదిస్తోంది.అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఏదైనా జరగొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube