మీకు తెలుసా : వాట్సప్‌ గురించి వస్తున్న ఆ వార్తలన్నీ పుకార్లే

కరోనా కంటే భయంకరంగా తయారయ్యాయి కొన్ని పుకార్లు.వాట్సప్‌లో కొన్ని పుకార్లు అత్యంత దారుణంగా విచిత్రంగా ప్రచారం జరుగుతున్నాయి.

 Fake News About Whatsapp Admin And Foreword Massage, Whats App, Fake Message, Fa-TeluguStop.com

కరోనా గురించి ఈమద్య కాలంలో కొన్ని వందల కొద్ది పుకార్లు షికార్లు చేస్తున్నాయి.వాట్సప్‌లో పుకార్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా పుకార్లకు చెక్‌ పెట్టేందుకు ఫ్యాక్ట్‌ ఫైండర్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

మీడియాలో వచ్చే వార్తలను ఆ సంస్థ క్రూడీకరించి అసలు విషయం ఏంటీ.అసలు నిజం ఏంటీ అనే విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.

Telugu Corona, Factfinder, Message, Whats App-General-Telugu

వాట్సప్‌ ద్వారా పుకార్లు ఎక్కువగా సర్క్యులేట్‌ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.ఫేక్‌ న్యూస్‌ ఎక్కువగా స్ప్రెడ్‌ అవ్వకుండా ఉండేలా చూడాలంటూ వాట్సప్‌కు సూచించింది.దాంతో వాట్సప్‌ కొన్ని మార్పులు చేసింది.అయితే ఫేక్‌ న్యూస్‌లను అరికట్టేందుకు వాట్సప్‌ కొత్తగా రకరకాల మార్పులు చేసింది అంటూ ఫేక్‌ వార్త ఒకటి ప్రచారం జరుగుతోంది.

ఫేక్‌ న్యూస్‌ గురించి ఫేక్‌ వార్త రావడం కాస్త హాస్యాస్పదంగానే ఉన్నా ఇది మాత్రం నిజం.

ఆ ఫేక్‌ వార్త ఏంటీ అంటే వాట్సప్‌లో ఏదైనా ఒక మెసేజ్‌ను మనం అందుకున్న సమయంలో దాన్ని మనం ఫార్వర్డ్‌ చేసేందుకు ప్రయత్నించగా అది నిజమైనదే అయితే బ్లూ టిక్‌ మార్క్‌ పడతాయి.

నిజం కాదంటూ రెడ్‌ టిక్‌ మార్క్‌ పడతాయి. బ్లూ రెడ్‌ టిక్‌ మార్క్‌ పడి ఉన్నట్లయితే అది ఇంకా ప్రభుత్వం నుండి అధికారికంగా నిర్ధారించలేదు.కనుక అది పుకారు అయ్యి ఉండవచ్చు, పేక్‌ న్యూస్‌ అయ్యే అవకాశం ఉందని గుర్తించాలి.ఇలా వాట్సప్‌లో కొత్త ఫీచర్‌ గురించి కొందరు ఫేక్‌ న్యూస్‌ను పుట్టించారు.

తాజాగా వాట్సప్‌ ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది.

Telugu Corona, Factfinder, Message, Whats App-General-Telugu

వాట్సప్‌లో ఒకే ఒక్క మార్పు వచ్చింది.అదేంటీ అంటే గతంలో అయిదుగురికి ఫార్వర్డ్‌ మెసేజ్‌ పంపించే అవకాశం ఉండేది.కాని ఇప్పుడు అలా కాదు.

కేవలం ఒక్కరికే ఫార్వర్డ్‌ మెసేజ్‌లు పంపించే అవకాశం ఉంటుంది.దాన్ని మళ్లీ పంపించవచ్చు.

కాని ఎక్కువ మందికి పంపించాలంటే కాస్త ఎక్కువ సమయం పడుతుంది.అందుకే ఫేక్‌ న్యూస్‌ వేగంగా విస్తరించడం తగ్గుతుందని వాట్సప్‌ ఇంకా కేంద్రం భావిస్తుంది.

ఇక ఫార్వర్డ్‌ మెసేజ్‌ అనే విషయం తెలిసే మాదిరిగా ఇప్పటికే వాట్సప్‌ మార్పులు చేసిన విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube