హుజూర్‌ నగర్‌లో టీడీపీ పరిస్థితి ఏంటీ?

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన టీడీపీ ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉంది.పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంపై టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

 Whatis The Tdp Switchwation On Huzurnagar Elections-TeluguStop.com

తెలంగాణలో టీడీపీ మొత్తం లేకుండా పోయింది అనుకునేలా ఎందుకు పోటీ చేయకుండా ఉండాలంటూ కొందరు నేతలు ప్రశ్నించారు.కాని తెలుగు దేశం పార్టీ నాయకులు వద్దనుకున్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ తాజాగా జరిగిన హుజూర్‌ నగర్‌ ఎన్నికల్లో పోటీ చేసింది.కిరణ్మయిని పోటీకి దించి పలువురు టీడీపీ ముఖ్య నాయకులు ప్రచారం చేశారు.

ఏపీ నుండి కూడా ప్రచారంకు వచ్చారు.కాని కిరణ్మయికి మినిమం ఓట్లు కూడా దక్కలేదు.

మూడవ స్థానంలో నిలుస్తామని చెప్పిన టీడీపీ బీజేపీ తర్వాత స్థానంకు పడిపోయింది.కేవలం 1827 ఓట్లు మాత్రమే రావడంతో కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు.

టీడీపీ పరువు పోగొట్టుకోవడం తప్ప మరేం లేదని, తెలంగాణలో ఇకపై పోటీ చేయకుంటేనే మంచిది అంటూ కొందరు సూచిస్తున్నారు.కాని రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ పడబోతుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube