ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ హీరోయిన్ ఆర్.కే రోజా మధ్య గత 25 సంవత్సరాలుగా వైరం నడుస్తోందట.
ఈ పాతిక సంవత్సరాల్లో వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలే రాలేదు.నిజానికి వాళ్ళిద్దరు ఏ సందర్భంలోనూ కలిసి ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదట.
అయితే చాలా కూల్ గా ఉండే వీళ్ళిద్దరూ మాట్లాడుకోపోవడానికి కారణం ఏమిటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
అప్పట్లో రోజా తన భర్త అయిన ఆర్కే సెల్వమణి తో కలసి వెంకటేష్ హీరో గా, తాను హీరోయిన్ గా ఒక సినిమా రూపొందించాలని అనుకున్నారు.
ఆ సినిమా ప్రాజెక్టు కి చినరాయుడు అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ప్రారంభం కాకుండానే అటకెక్కింది.అయితే ఇదే కథాంశం తో వెంకటేష్.విజయశాంతి తో కలిసి చినరాయుడు అనే టైటిల్ తో ఒక సినిమాని చేశారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న రోజా బాగా కోప్పడ్డారు.అలాగే, నాతో తీయాల్సిన సినిమా ని విజయశాంతి తో కలిసి తీశారు ఏంటి అని వెంకటేష్ ని ఆమె నిలదీశారు.
అయితే ఈ విషయం లో తనకు ఎటువంటి సంబంధం లేదని.దర్శక నిర్మాతలు మాత్రమే విజయశాంతి ని హీరోయిన్ గా పెట్టి సినిమా ని పూర్తి చేశారని వెంకటేష్ రోజా తో చెప్పి తప్పించుకున్నారట.
ఆ తర్వాత ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం లో పోకిరి రాజా సినిమా లో రోజా, వెంకటేష్ లను హీరోహీరోయిన్లుగా ఎంపిక చేశారు.తదనంతరం ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చిత్ర యూనిట్ బొంబాయి వెళ్లిందట.అయితే రోజా ని ముంబైలోని ఒక హోటల్లో మూడు రోజులపాటు ఖాళీగా కూర్చో పెట్టారట.
దీంతో బాగా విసిగి పోయిన రోజా ఖాళీగా కూర్చోబెట్టారు ఏంటి? సినిమా షూటింగ్ ఉందా లేదా అని దర్శక నిర్మాతలను నిలదీశారట.కానీ వారి నుంచి సరైన సమాధానం రాలేదట.
దీంతో ఆమె.ఆర్.కే సెల్వమణి బర్త్ డే ఉందని చెప్పాపెట్టకుండా బొంబాయి నుంచి వెళ్లిపోయారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న దర్శకనిర్మాతలు ఒక్క సారిగా షాక్ అయ్యారు.
త్వరగా బొంబాయి వస్తే షూటింగ్ పూర్తి చేస్తామని రోజా ని అడిగారట.కానీ ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదట.
స్వయంగా విక్టరీ వెంకటేషే ఫోన్ చేసి రోజా ని షూటింగ్ కి రావాలని కోరారట కానీ ఆమె మాత్రం రానంటే రాను అని తేల్చి చెప్పారట.దీంతో దర్శక నిర్మాతలు రోజా ని బతిమిలాడి మరీ ముంబైకి రప్పించి ఆమెకు సంబంధించిన షూటింగ్ ఫినిష్ చేసి పోకిరి రాజా సినిమా ని పూర్తి చేసారు.
అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత రోజా వెంకటేష్ తో అస్సలు మాట్లాడలేదు.తనని ఇబ్బంది పెట్టిన వెంకటేష్ తో అసలు సినిమా చేయకూడదనే రోజా ఇలా ఆయనకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది.
ఏది ఏమైనా రోజా, వెంకటేష్ మధ్య వైరం ఉన్న విషయం గురించి సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందికి తెలియదట.