మీకిష్టమైన రంగుని బట్టి మీ ప్లస్ లు, మైనస్ లు మీకోసం..

జాతకాలు ,రంగు రాళ్లు ఇతరత్రా విషయాలను మూఢనమ్మకాలు అని కొట్టేసినప్పటికి,సైకాలజిని చాలామంది నమ్ముతారు.మనుషుల అలవాట్లను బట్టి వారివారి వ్యక్తిత్త్వాలను, ఇష్టాలను బట్టి వారి ఆటిట్యూడ్ ను, స్పందించే తీరును బట్టి వారి మెచ్యురిటీ లెవల్ ను అటుఇటుగా లెక్కకట్టొచ్చు.

అందులో భాగమే ఈ కలర్ సైకాలజి.నచ్చిన కలర్ ను బట్టి సదరు వ్యక్తి ప్లస్ లు ,మైనస్ లు ఎలా ఉంటాయో తెలుపుతుంది కలర్ సైకాలజి.మీ మీ ఇష్టమైన రంగుల్ని బట్టి మీ సైకాలజి ఏంటో తెలుసుకోండి.

తెలుపు:

Plus: మంచి ఆలోచనలు ఉంటాయి, టెన్షన్స్ తక్కువ, ప్రశాంతత ఎక్కువ,

Minus: ఎవరిని పడితే వారిని త్వరగా నమ్ముతారు, మోసపోవడం అలవాటు.

లేత పసుపురంగు:

Plus:తెలివి ఎక్కువ ,నిద్ర ప్రియులు , శృంగార కాముకులు.

Minus: ఆరోగ్యాన్ని పట్టించుకోరు, తమనుతాము ఎక్కువగా ఊహించుకుంటారు, కోపం ఎక్కువ.

ఎరుపు:

Plus:ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.సామాజిక బాధ్యత ఎక్కువ.

Minus: తమలాగే ప్రతి ఒక్కరు ఉండాలని అనుకుంటారు.చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటారు.

ఆకుపచ్చ:

Plus: లీడర్ లక్షణాలు ఎక్కువ, అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.ప్యూచర్ మీద పక్కా ప్లానింగ్ ఉంటుంది.

Minus: ఈర్ష్య, అసూయలు ఎక్కువ, అనుకున్నదానిని సాధించడం కోసం పక్కవాళ్లను ఇబ్బంది పెట్టడానికి కూడా వెనుకాడరు.

లేత నీలం:

Plus: మెచ్యురిటీ లెవల్స్ ఎక్కువ, ఇట్టే ప్రేమలో పడిపోతారు.మనుషులంటే మంచోళ్లు అనే బేసిక్ ప్రిన్సిపుల్ ఫాలో అవుతారు.

Minus: వీరి మంచితనం బయటికి చేతగాని తనంగా కనిపిస్తుంటుంది, వీరి గురించి డెప్త్ గా తెలియనంత వరకు ఫ్రెండ్స్ వీరిని చులకనగా చూస్తుంటారు.

గులాబి:

Plus: దైవ భక్తి ఎక్కువ, తమదైన వారంలో పక్కగా దేవుడి దర్శనం, పుణ్యక్షేత్రాల పర్యటనను పెట్టుకుంటారు.సహాయం చేయడంలో ముందుంటారు.

Minus: మూఢనమ్మకాలు ఎక్కువ, డబ్బును వృథా గా ఖర్చు చేస్తారు.

ఊదా:

Plus: వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు, డబ్బు విలువ తెలిసి వ్యవహరిస్తారు.

Minus: అనవసర గొడవలకు కారకులవుతారు.ఇతరులను లెక్క చేయరు.

గోధుమ:

Plus: ఎందరిలో ఉన్న వీరే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉంటారు.ఏదో ఒక రంగంలో విశిష్ట ప్రావీణ్యం కలిగి ఉంటారు.

Minus: పొగరు, గర్వం అధికం.

కాషాయం:

Plus: అందం మీద దృష్టి ఎక్కువ, ప్రయాణాలన్న ఇష్టమే…పోటీతత్త్వం ఎక్కువ.

Minus: వీరిలో కూాడా ఈర్ష్య , అసూయలు ఎక్కువే, అలసట ఎక్కువ.

బ్లాక్:

Plus: మొండి ధైర్యం ఎక్కువ, నలుగురిలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ఆరాడపడతారు.దైవభక్తి తక్కువ.

Minus: ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.కలుపుగోలు తత్త్వం చాలా తక్కువ.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube