మీరు లిఫ్టులో ఉన్న‌ప్పుడు హ‌ఠాత్తుగా కేబుల్‌ తెగితే..

నేడు పెరుగుతున్న పట్టణ సంస్కృతిలో ఎత్తైన భవనాలు మరియు అపార్ట్‌మెంట్లు అత్య‌ధికంగా నిర్మిత‌మ‌వుతున్నాయి.ప్రజలు ఫ్లాట్లలో నివసించ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు.

 If The Cable Suddenly Breaks While You Are In The Elevator , Cables, Lift Broken-TeluguStop.com

ఇటువంటి సంద‌ర్భంలో లిఫ్ట్‌ని ఉపయోగించడం త‌ప్ప‌నిస‌రి.లిఫ్టు అనేది ఎలా ప‌నిచేస్తుందంటే.

లిఫ్ట్ క్యాబిన్ పైభాగంలో రివాల్వింగ్ రిమ్ ఉంటుంది.లిఫ్ట్‌ను కేబుల్ ద్వారా పైకి లేదా కిందికి తీసుకువెళుతున్న‌ప్పుడు ఈ రిమ్‌లోని కేబుల్ ప‌నిచేస్తుంటుంది.

లిఫ్ట్ కేబుల్ అనేది అనేక ఉక్కు వైర్లను ఒకదానితో ఒకటి చుట్టడం ద్వారా తయార‌వుతుంది.ఈ కేబుల్స్ చాలా బలంగా ఉంటాయి.

అయితే, అవి ఎప్ప‌టికీ తెగ‌వ‌ని చెప్ప‌లేం.మీరు లిఫ్టులో ఉన్న‌ప్పుడు కేబుల్ తెగితే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

లిఫ్ట్‌లలో చాలా కేబుల్స్ ఉంటాయి.ఒక కేబుల్ తెగిన‌ప్పుడు మరొక కేబుల్ సహాయంతో లిఫ్టు ప‌నిచేస్తుంది.

చాలా లిఫ్ట్‌లు బరువును అనుస‌రించి 4 నుంచి 8 కేబుల్‌ళ్ల‌ను కలిగి ఉంటాయి.లిఫ్ట్ కేబుల్స్ అన్నీ ఒకేసారి తెగిపోయాయని అనుకుందాం.అప్పుడు లిఫ్ట్‌లోని ఇతర భద్రతా పరికరాలు ప‌నిచేయడం ప్రారంభిస్తాయి.లిఫ్ట్ పడిపోవడం అనేది జ‌రిగితే లిఫ్ట్ బ్రేకింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.

లిఫ్ట్‌లోని ప్రతి అంతస్తులో సేఫ్టీ క్లాంప్‌లు ఉంటాయి.ఇవి పడిపోతున్న లిఫ్ట్‌ను ఆపడానికి బయటకు వస్తాయి.బ్రేకింగ్ గవర్నర్‌ను తిప్పిన వెంటనే బ్రేకింగ్ సిస్టమ్ ప‌నిచేస్తుంది.అన్ని భద్రతా పరికరాలు విఫలమైతే లిఫ్ట్ నేరుగా నేలపైకి వస్తుంది.లిఫ్ట్ దిగువన షాక్ ప్రూఫ్‌ వ్యవస్థ ఉండ‌టంతో లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తులు కుదుపులకు గురికాకుండా కిందికి వ‌చ్చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube