మనలో ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు.చాలామందికి చిత్రవిచిత్రమైన కలలు వస్తూ ఉంటాయి.
ఆ కలల్లో మనకు తెలియని ప్రదేశాలు, మనం ఎప్పుడూ చూడని ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి.అయితే నిపుణులు, శాస్త్రవేత్తలు మనకు వచ్చే కలలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏవో సంకేతాలను ఇస్తాయని చెబుతున్నారు.
మనలో ప్రతి ఒక్కరికీ కలలు వచ్చినా మనం వేటి గురించి ఆలోచిస్తామో వాటికి సంబంధించిన కలలే ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఆనందంగా ఉన్నప్పుడు వచ్చే కలలు ఆహ్లాదాన్ని కలిగిస్తే బాధగా ఉన్న సమయంలో వచ్చే కలలు భయాన్ని కలిగిస్తాయి.
ఏ విషయం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తామో ఆ విషయాలే మనల్ని కలల రూపంలో ప్రభావితం చేస్తాయి.అయితే నిపుణులు అన్ని కలలు మనుషులపై ప్రభావం చూపవని తెల్లవారుజామున వచ్చే కలలు మాత్రమే ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
సముద్రం మన కలలో కనిపిస్తే సమస్యలు కొలిక్కి వస్తున్నయని అర్థం అని నిపుణులు చెబుతున్నారు.

సముద్ర కెరటాలు బాగా కనిపిస్తే మనకు ఇతరుల నుంచి సహాయ సహకారాలు బాగా అందుతాయని అర్థం చేసుకోవాలి.సముద్రంలో భీభత్సం కనిపిస్తే పెద్ద సమస్య మనల్ని చుట్టుముడుతుందని అర్థం చేసుకోవాలి.కలలో బీచ్ కనిపిస్తే అదృష్టం మనల్ని వరించబోతుందని అర్థం.
కల్లోల సముద్రం కలలో కనిపిస్తే మీలో అసాధారణమైన ధైర్యాన్ని ప్రభావితం చేస్తుందని… ఎలాంటి విషమ పరిస్థితిని అయినా తట్టుకోగలిగిన సామర్థ్యం మనలో ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.తెల్లవారుజామున వచ్చే కలలను అంత తేలికగా తీసిపారేయవద్దని… ఆ కలలు మనకు కొన్ని సంకేతాలను ఇస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.