బుధవారం హయగ్రీవునిని పూజిస్తే ఏం జరుగుతుందంటే?

హయగ్రీవుని కి బుధవారం పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి.సాధారణంగా కష్టాలతో సతమతమవుతున్న వారిని ఆ దేవుడే కాపాడాలని అంటారు.

 What Will Happen If Wednesday Praise Hayagrivudu-TeluguStop.com

అలాంటి వారిని కాపాడడం కోసమే శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడని మన పురాణాలు చెబుతున్నాయి.అందులో భాగంగానే ఈ హయగ్రీవుని అవతారం కూడా ఒకటి.

పురాణాల ప్రకారం హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు.ఆ రాక్షసునికి గుర్రం తలను కలిగి ఉండి ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం కఠినమైన తపస్సుచేసి ఆ బ్రహ్మ దేవుడు నుంచి వరం పొందుతాడు.

 What Will Happen If Wednesday Praise Hayagrivudu-బుధవారం హయగ్రీవునిని పూజిస్తే ఏం జరుగుతుందంటే-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన ఆకారాన్ని పోలిన వారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించాలనే వరాన్ని హయగ్రీవుడు బ్రహ్మదేవుడిని అడుగుతాడు.బ్రహ్మదేవుడు నుంచి ఆ వరం పొందిన హయగ్రీవుడు ఎంతో గర్వంతో సాదు సత్పురుషులను నానా రకాలుగా హింసించేవారు.

దాంతో దేవతలందరూ కలిసి ఆ ఆది దంపతులను హయగ్రీవుడు నుంచి కాపాడాలని వేడుకుంటారు.

అప్పుడు పార్వతీదేవి యోగనిద్రలో ఉన్న ఆ విష్ణు భగవానుని మేల్కొల్పితే ఆయనే హయగ్రీవుని సంహరిస్తాడని దేవతలతో చెప్పడంతో, తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకొని నిద్రిస్తున్న విష్ణు భగవానుడిని మేల్కొలపడానికి శివుడు చెద పురుగుగా మారి ఆ వింటి తాడును లాగుతాడు.

దాంతో ఒక్కసారిగా బాణం పైకి వెళ్లి ఆ విష్ణుమూర్తి తలను ఖండిస్తుంది.

తల తెగడం వెనుక ఉన్న కారణాన్ని గ్రహించిన ఆదిదంపతులు గుర్రం తల తెచ్చి ఆ విష్ణుమూర్తికి అతికిస్తారు.

అమ్మవారితో సహా దేవాది దేవుళ్ళు తమ జ్ఞానాన్ని, శక్తిసామర్థ్యాలను గుర్రంతలతో పోలి ఉన్న ఆ మహావిష్ణువుకు ధారపోస్తారు.అందుచేతే హయగ్రీవుని ని విద్యలకు అధిపతి గా.జ్ఞాన ప్రదాతగా భావిస్తారు.తన అవతారం వెనుక ఉన్న ఈ కార్యాన్ని నెరవేర్చిన శ్రీ మహావిష్ణువు సతీ సమేతంగా దేవతలకు దర్శనమిచ్చాడు.

విష్ణుమూర్తి ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కావడం వల్ల ఆరోజు ఎవరైతే స్వామి వారిని దర్శించుకుంటారో వారికి విద్య, విజ్ఞానం లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి.అలాగే బుధవారం రోజున హయగ్రీవుని కి యాలకుల మాలతో పూజించడం వల్ల మనం అనుకున్న కార్యాలు ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి.

#Hindu Rituals #Rich Persons #Wednesday Pooja #Hindu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU