ప్రజా దర్బార్‌తో సీఎం జగన్ సాధించేదేంటి?

ఏపీ సీఎం జగన్ త్వరలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.దీంతో వైసీపీ నేతలందరూ ఈ కార్యక్రమంపై ప్రణాళికలు రచిస్తున్నారు.

 What Will Cm Jagan Achieve With Praja Darbar?.. Andhra Pradesh, Praja Darbar, Cm-TeluguStop.com

అయితే తూతూ మంత్రంగా కాకుండా ప్రతిష్టాత్మకంగా ప్రజాదర్బార్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.సీఎం జగన్ చేపట్టే ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు వస్తారని.

వాళ్ల సమస్యలను పరిష్కరించి ఇంటికి పంపేలా ఏర్పాట్లు చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.అయితే ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడం అల్లాటప్పా విషయమేమీ కాదని కొందరు నేతలు అంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్యలు నిమిషాలు, గంటల్లో పరిష్కారం కావని పలువురు వైసీపీ నేతలు భావిస్తున్నారు.ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా వినతులు తీసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే సరిపోతుందని.

తద్వారా ప్రజలకు సీఎం దూరం అవుతున్నారనే విమర్శలకు చెక్ పెట్టాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కొందరు వైసీపీ నేతలు చెప్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

అంటే ఈ కార్యక్రమం ప్రజల కోసం కాకుండా పార్టీ కోసం అని వైసీపీ నేతల మాటల ద్వారా అర్ధమవుతోంది.

అందుకే ఎన్నికల వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ప్రతిపక్షాల ఆటలు సాగనివ్వకుండా చేయాలని వైసీపీ నేతలు అధిష్టానానికి సూచనలు పంపుతున్నారు.మరోవైపు ప్రజల సమస్యలను స్వయంగా తాను విన‌డం ద్వారా బాధితులకు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని జగన్ భావిస్తున్నారు.

త‌ద్వారా వారు సంతృప్తుల‌వుతార‌ని లెక్కలు వేసుకుంటున్నారు.

Telugu Aarogyasri, Andhra Pradesh, Ap Poltics, Cm Jagan, Farmers, Problems, Praj

కాగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని వైసీపీ నేతలకు పరిమితం చేయకుండా ముఖ్య‌మంత్రి స్వ‌యంగా ప్రజల దగ్గరకు వెళ్ల‌డం.లేదంటే ప్రజలే ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర‌కు రావ‌డం అనేది మంచి ప్ర‌య‌త్న‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.సమస్య ముఖ్యమంత్రి వద్దకు వెళ్లింది కాబట్టి పరిష్కరించడంలో అధికారులు తాత్సారం చేసే అవకాశం ఉండదంటున్నారు.

అయితే ఇలాంటి కార్యక్రమాలకు ఆరోగ్య శ్రీ, ఇంటి పట్టాలు, పింఛన్లు, రైతు సమస్యలపైనే ఎక్కువగా వినతులు వస్తుంటాయి.వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా జగన్ అధికార యంత్రాగాన్ని సిద్ధం చేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube