యూపీలో ఓడిపోతే కేంద్రంలో బీజేపీ ప‌రిస్థితి ఏంటి..?

యూపీ ఎన్నికలను బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.యూపీలో దాదాపు 80 ఎంపీ స్థానాలున్నాయి.

 What Will Be The Situation Of Bjp At The Center If It Loses In Up  Bjp,  Cm Yogi-TeluguStop.com

ఇక్కడ గెలిచి సత్తా చాటితే 2024 ఎన్నికల్లో కేంద్రంలో కూడా గెలవడం సులభమవుతుందని చాలా మంది బీజేపీ నేతలు భావిస్తున్నారు.ఒక వేళ ఇక్కడే ఓడిపోతే 2024 ఎన్నికల సమయానికి తమ పరిస్థితులు మరింత దిగజారుతాయని అంటున్నారు.

అందుకోసమే ఇక్కడ ఎలాగైనా సరే గెలవాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది.గెలిచేందుకు కొత్త కొత్త దారులను వెతుకుతోంది.

ఎలాగైనా సరే గెలుస్తామనే విశ్వాసం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.కానీ ఓడిపోతే ఎలా ఉంటుందనే ఆందోళన కూడా వారి మొహాల్లో తెలుస్తోంది.

2022లో జరిగే యూపీ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని అంతా భావిస్తున్నారు.యూపీలో బీజేపీ అధికారం నిలబెట్టుకోకపోతే కేంద్రంలోకూడా కష్టమే అని చాలా మంది చెబుతున్నారు.

మోదీ షా ద్వయానికి ఉన్న ఫాలోయింగ్ పోతుందని అంటున్నారు.కావున మోదీ షా ద్వయం యూపీ ఎన్నికల మీద చాలా ఫోకస్ చేస్తుంది.

ప్రస్తుతం 5 రాష్ట్రాల కు ఎన్నికలు జరుగుతున్నా కానీ బీజేపీ పార్టీ యూపీ మీద ఫోకస్ చేసినంతగా మరే రాష్ట్రం మీదా ఫోకస్ చేయడం లేదు.అందుకు కారణాలు కూడా లేక పోలేదు.

యూపీ ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే దేశవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు పోతాయని తద్వారా 2024 ఎన్నికల్లో చాలా కష్టం అవుతుందని బీజేపీ నేతలతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇక్కడ గెలిచి సత్తా చాటితే యోగిని జాతీయ నాయకుడిగా, మోదీ తర్వాత వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం బీజేపీకి ఉండనుంది.కానీ యూపీలోనే పార్టీ ఓడిపోతే అటువంటి అవకాశాన్ని బీజేపీ కోల్పోయే ప్రమాదం ఉంది.మరి యూపీ ప్రజలు ఏమని భావిస్తున్నారో… వారి తీర్పు ఏ విధంగా ఉండనుందో?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube