సోలో బ్రతుకే ఆగమైతే ఏమిటి పరిస్థితి?

టాలీవుడ్‌లో వెండితెరపై బొమ్మ పడి దాదాపు ఎనిమిది నెలలు దాటింది.కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది.

 What Will Be The Fate Of Solo Brathuke So Better, Solo Brathuke So Better, Sai D-TeluguStop.com

దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

దీంతో ప్రస్తుతానికి కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు తెరుచుకున్నాయి.అయితే సగం అక్యుపెన్సీతోనే ఈ థియేటర్లు నడుస్తుండటంతో తెలుగు సినిమాలు ఏవీ కూడా ప్రస్తుతం రిలీజ్ కావడం లేదు.

ఈ క్రమంలో తెలుగు స్టార్ హీరోలు తమ సినిమాలను వరుసబెట్టి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.వారందరిలో ముందుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.కాగా ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటుండటంతో ఈ సినిమాను క్రిస్మస్ సమయంలో రిలీజ్ చేస్తు బాగుంటుందని చిత్ర యూనిట్ భావించి, ఈ సినిమా రిలీజ్‌ను డిసెంబర్ 25న ఫిక్స్ చేశారు.

అయితే నెమ్మదిగా థియేటర్లు తెరుచుకుంటున్నా ప్రేక్షకులు సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తారా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు.అటు సగం ప్రేక్షకులతో సినిమాను ప్రదర్శించేందుకు యాజమాన్యాలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తు్న్నాయి.

ఒకవేళ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం రిలీజ్ అయ్యే నాటికి ఇంకా ఇలాంటి పరిస్థితే నెలకొంటే ఈ సినిమాకు భారీ నష్టం తప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు.మరి సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యి ఎలాంటి రిజల్ట్‌ను సాధిస్తుందా అనేది ప్రస్తుతం మిగతా చిత్రాల దర్శకనిర్మాతలు ఆసక్తిగా చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube