ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలపైనే దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో అత్యంత బడ్జెట్ కేటాయించి భారీ సినిమాల నిర్మాణంలో నిర్మాతలు కూడా బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే చిన్న సినిమాలకు ఆదరణ తగ్గుతుందని చెప్పాలి అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మాణ సారథ్యంలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బలగం(Balagam).ఈ సినిమా మార్చి మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇలా ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంట్లోనూ జరిగే ఒక నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్ గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.ఇలా ఒక చిన్న సినిమాగా విడుదలైనటువంటి బలగం సినిమా పెద్ద సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో నిర్మాత, దిల్ రాజ్ కుమార్తె హన్షిత రెడ్డి (Hanshitha Reddy)ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా హన్షిత రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఊరిలోను ప్రతి కుటుంబంలో జరిగే కథే బలగం.ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని వేణు కథ చెప్పినప్పుడు బలంగా నమ్మాము.అలా మా నమ్మకమే నేడు నిజమైంది.ఇక ఈ సినిమాని నాన్న ప్రేక్షకులతో కలిసి చూసిన తర్వాత మీరు ఎన్ని సినిమాలు చేసిన బలగం సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారని హన్షిత రెడ్డి బలగం సినిమా గురించి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తెలియజేశారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై నాన్న తెలుగు తమిళ భాషలలో భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు.అయితే భారీ బడ్జెట్ సినిమాలతో పాటుప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేయాలని అలాగే చిన్న సినిమాలను కూడా ఆదరించాలన్న ఉద్దేశంతోనే ఈ బ్యానర్ ఏర్పాటు చేశామంటూ ఈ సందర్భంగా హన్షిత తెలియజేశారు.
