'రాములమ్మ' రాజకీయ అడుగులు ఎటువైపు ?  

What Vijaya Shanthi Going To Do In Politics-kcr,revanth Reddy,roja,telangan Congress,trs,vijaya Shanthi,vijaya Shanthi Next Movie

లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరుపొందిన తెలంగాణ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి అలియాస్ రాములమ్మ పొలిటికల్ కెరియర్ గందరగోళంలో పడినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఆమె ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రాకపోవడం, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కానీ కేంద్రంలో గాని కోలుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఆమె పార్టీ మారాలని ఆలోచనలో ఉన్నట్టు ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బిజెపి లోకి వెళ్తారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి..

'రాములమ్మ' రాజకీయ అడుగులు ఎటువైపు ? -What Vijaya Shanthi Going To Do In Politics

ఇక బీజేపీ కూడా ఆమెను పార్టీలో చేరాల్సిందిగా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటూ మరింత బల పడుతున్న బిజెపి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తోంది.

ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయగలిగిన బలమైన నాయకులను గుర్తించి పార్టీలో చేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే విజయశాంతి శక్తిసామర్ధ్యాలు ఏమిటో బిజెపికి బాగా తెలుసు.

ఆమె గతంలో బిజెపి లో ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని చాలా ఉధృతంగా నడిపించారు. ఆ తర్వాత ఆమె బిజెపి నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారు. కానీ ఎంతోకాలం ఆమె పార్టీని నడిపించలేక టీఆర్ఎస్ లో ఆ పార్టీని విలీనం చేసేసారు..

మొదట్లో టీఆర్ఎస్ లో ఆమెకు విపరీతమైన ప్రయార్టీ దక్కింది. ఆ తర్వాత కేసీఆర్ విజయ శాంతికి మధ్య విభేదాలు ఎక్కువ అవ్వడంతో టిఆర్ఎస్ లో కూడా ఆమె ఇమడలేక కాంగ్రెస్ గూటికి చేరారు.

ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈమెను పెద్దగా పట్టించుకోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విజయశాంతిని బిజెపి లోకి తీసుకురావడం ద్వారా అటు కాంగ్రెస్ కు, ఇటు టీఆర్ఎస్ కు ఒకేసారి చెక్ పెట్టవచ్చని బిజెపి పెద్దలు ఆలోచన చేస్తున్నారు.

ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేనట్టుగానే ఉన్నారు. పార్టీపరంగా జరిగే కార్యక్రమాలకు ఆమెకు ఆహ్వానాలు పంపించక పోవడంతో అసంతృప్తికి గురై ఇటీవల జరిగిన కోర్ కమిటీ మీటింగ్ కూడా డుమ్మా కొట్టారట. ప్రస్తుతం ఆమె వ్యవహారం చూస్తుంటే త్వరలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కమలం పార్టీలో చేరేటట్లు గానే కనిపిస్తోంది..