ఇంట్లో ఏ తులసి నాటాలి? ఏ దిశలో నాటాలి?

మన దేశంలో కృష్ణతులసి, రామతులసి, లక్ష్మీతులసి, కర్పూర తులసి, వస తులసి, నేల తులసి, అడవి తులసి, రుద్రతులసి లాంటి  ఎన్నో రకాల తులసి మొక్కలున్నాయి.అయితే మనం ఏ తులసికి పూజ చేస్తే.

 What Type Thulasi Planted-in-home, Basil , Thulasi Planted , Devotional , Krushn-TeluguStop.com

ఫలితం ఉంటుంది, తులసి మొక్కలను ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో ఎక్కువగా లక్ష్మీ, రామ, కృష్ణ తులసి మొక్కలు పెట్టుకొని పూజిస్తుంటారు.ముఖ్యంగా ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు.

ఏ దిశలో ఉంచకూడదు.?

తులసి చెట్టును ఇంట్లో సరైన దిశలో ఉంచాలి.దీనివలన ఇంట్లో సౌభాగ్యం సంప్రాప్తిస్తుంది.

అయితే ఈ చెట్టును దక్షిణ దిశలో ఉంచకూడదు.ఎందుకంటే ఆ దిక్కులో తులసి మొక్క ఉండడం అపవిత్రంగా భావిస్తారు.

ఒకవేళ అనుకోకుండా లేదా తెలియకుండా ఇలా చేసినట్లయితే మీ వెంటే దురదృష్టం తాండవిస్తుంది.దురదృష్టవశాత్తు మారడానికి ఎక్కువ సమయం పట్టదు.

దీని ఫలితంగా, మీ ఇంట్లో పేదరికం వస్తుంది.అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవ పెరుగుతుంది.

Telugu Devotional, Krushna Thulasi, Rama Thulasi, Thulasi-Telugu Bhakthi

ఏ దిశలో నాటాలి.

సనాతన ధర్మం ప్రకారం తులసి చెట్టును ఇంటికి ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశలో నాటాలి.ఈ దిశలో మొక్కను నాటడం వలన ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది.ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటవచ్చు.

తులసి మొక్కను నాటగానే కాదు దానిని చాలా బాగా సంరక్షించుకోవాలి.చెట్టుకేమైనా అయితే దాని ప్రభావం మన జీవన విధానం మీద చూపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube