నిద్రకి ముందు ఏం తినాలి? ఏం తినకూడదు  

What To Eat And What Not To Eat Before Sleep?-

రాత్రిపూట ఎలాంటి విరామం లేకుండా, సుఖంగా, ప్రశాంతంగా 7-8 గంటల నిద్రపోవాలని ఎవరికి ఉండదు. అదే మనిషి శరీరానికి అవసరం కూడా. కాని కొందరు ఆహారపు అలవాట్లతో నిద్ర చెడగొట్టుకుంటారు. బాహుషా, నిద్రలోకి జారుకోవడానికి సహాయపడే ఆహారం ఏదో, నిద్రను చెడగొట్టే ఆహారం ఏదో అవగాహన లేకపోవడం వలనేమో...

నిద్రకి ముందు ఏం తినాలి? ఏం తినకూడదు-

అందుకే నిద్రకి ముందు ఏ ఆహారం తినాలో, ఏం తినకూడదో చూద్దాం.* రాత్రిపూట లైట్ ఆహారం తీసుకోవడమే మంచిది. వినే ఉంటారు, “డైన్ లైక్ ఏ బెగ్గర్” అనే సామెత. కాబట్టి స్పైసీ, హెవీ ఆహారం వద్దు.

ఆసిడ్ రిఫ్లక్స్ సమస్యతో నిద్ర చెడిపోవచ్చు.* కాఫీ మెదడుని ఉత్తేజపరచడానికి పనిచేస్తుంది. దీన్ని ఉదయంపూట, వర్కింగ్ అవర్స్ లో తీసుకోవాలి.

విశ్రాంతి తీసుకునేటప్పుడు కాదు.* ఆల్కహాల్ తాగడం, నీళ్ళి అతిగా తాగడం కూడా నిద్రకి ముందు చేయకూడని పనులు. మధ్యలో మూత్రవిసర్జన కోసం నిద్ర లేవాల్సి వస్తుంది.

* చెర్రిల్లో నిద్రకు ఉపయోగపడే మెలాటోనిన్ ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ట్రై చేయండి.* అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం ఉండటం వలన ఇది రిలాక్సేషన్ కి ఉపయోగపడుతుంది.

* స్వీట్ పొటాటోలో కూడా పొటాషియం ఉంటుంది. ఇది కూడా అరటిపండు లాగే నిద్రకి ఉపయోగపడుతుంది.