వ్యాయామం తర్వాత తీసుకోవలసిన ఆహారం  

అన్ని వ్యాయామాల కంటే తేలికైన వ్యాయామం నడక. నడక వల్ల శరీరంలో వేగంగా కేలరీలు ఖర్చు అయ్యి శక్తి తగ్గుతుంది. అందువల్ల వ్యాయామం చేసిన తర్వాత కొన్ని ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఆ ఆహారాల మీద ఒక లుక్ వేద్దాం.

అరటిపండు

ఈ పండు వ్యాయామం చేసేవారికి బాగా సహాయపడుతుంది. బాగా అలసిపోయినప్పుడు అరటిపండును తింటే తక్షణమే శక్తి వస్తుంది. అరటిపండులో సమృద్ధిగా కార్బో హైడ్రేడ్స్ ఉంటాయి. అరటిపండును వెన్న తీసిన పాలలో కలిపి స్మూతీగా తయారుచేసుకొని దానిలో నిమ్మరసం కలిపి తింటే శరీరానికి తక్షణమే శక్తి అందుతుంది.

సలాడ్స్

వాకింగ్ చేసిన తర్వాత డీ హైడ్రేషన్ గురి కాకుండా ఉండాలంటే శరీరానికి తగినంత నీరు అవసరం. అందువల్ల నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి. ఉదయం సమయంలో పండ్లను సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఈ పండ్ల ద్వారా శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పీచు అందుతుంది.

కాయగూరలు

ఉదయం సమయంలో కాయగూరలను తీసుకోవటం వలన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

బాదం

నానబెట్టిన బాదం తీసుకోవటం వలన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అంతేకాక వీటిలో కొలస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది.