కొత్త 2000, 200నోట్లపై మరో పిడుగు లాంటి వార్త ! జాగ్రత్తగా లేకపోతే ఇక అంతే..!       2018-06-20   22:19:41  IST  Raghu V

అనుకోకుండా ఒకోసారి మన దగ్గర ఉన్న డబ్బు నోట్ల చినిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సాధారణంగా బ్యాంకు కి వెళ్లి మార్చుకుంటాము. కానీ పెద్ద నోట్ల విషయంలో అలా కుదరదు అంట. నోటు చిరిగింది అంటే..ఇక డబ్బులు పోయినట్టే లెక్క. రూ.200 నోటు విషయంలోనూ అదే పరిస్థితి

బ్యాంకులు కాకుండా ప్రైవేట్‌ వ్యక్తులు కూడా చిరిగిన నోట్లకు బదులుగా మంచి నోట్ల ఇస్తుంటారు. కాకపోతే కొంచెం కమీషన్‌ తీసుకుంటారు. అయితే పాత రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి రూ.2000 నోటు వచ్చింది. కొత్త భద్రలతో ఈ నోటు వచ్చి ఏడాదిన్నరకు పైగా అవడంతో ఇది కూడా పాతబడింది. ఇదే సమయంలో కొన్నిసార్లు అనుకోకుండా చిరిగిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అక్కడే వచ్చింది అసలు చిక్కంతా. వినియోగదారులు చిరిగిపోయిన, లేదా పాడైన రూ.2000 నోటును బ్యాంకుకు తీసుకెళ్తే.. చాలావరకు బ్యాంకులు తీసుకోవడం లేదు. దానికి సరిపడా నోటును లేదా నోట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

చిరిగిపోయిన రూ.2000 నోటును మార్చుకునేందుకు కొంతకాలం ఆగాల్సిందే. ఎందుకంటే ఈ విషయమై రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి నిబంధనలూ బ్యాంకులకు రాలేదు. వాస్తవంగా చిరిగిపోయిన నోటుకు ఎంత విలువ కట్టి ఇవ్వాలనే విషయమై గతంలోనే ఆర్‌బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే రూ.2 వేలు, రూ.200 నోట్లకు ఈ నిబంధనలు వర్తించకపోవడంపై ప్రజలు పెదవివిరుస్తున్నారు.

పెద్దనోట్ల రద్దు తర్వాత జారీ చేసిన కొత్తనోట్లను చూస్తే.. అవి పాత నోట్లతో పోలిస్తే.. చిన్నవిగా (రూ. 100 తప్ప) ఉన్నాయి. పాత రూ.50 నోటుతో పోలిస్తే.. రూ.2000 నోటు ఇప్పుడు చిన్నదిగా ఉంది. నిబంధనల్లో ఏమో చిరిగిన నోటు పరిమాణాన్ని బట్టి మార్పిడిని సూచించారు. ఈ కారణం వల్ల కూడా బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. రూ.200 నోటు విషయంలోనూ బ్యాంకులు ఇదే సందిగ్దతలో ఉన్నాయి.

కాబట్టి పెద్దనోట్ల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.