నీరు ఎంత తాగినా దాహం తీర‌ట్లేదా..ఇవి తీసుకుంటే స‌రి!

చ‌లి కాలం పోయి.వేస‌వి కాలం వ‌చ్చింది.

 What To Do To Reduce The Problem Of Over Thirst! Over Thirst, Summer Tips, Summe-TeluguStop.com

మార్చి నెల‌లోనే ఎండ‌లు పెర‌గ‌గా.ఏప్రిల్ వ‌చ్చే స‌రికి భానుడు భ‌గ భ‌గ మంటున్నాడు.

దాంతో ఇంట్లో నుంచి బ‌య‌ట కాలు పెట్టాలంటే భ‌య‌ప‌డుతున్నారు.ఇక ఎండలకు తోడు వేడి గాలులతో జ‌నాలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఈ వేస‌వి కాలంలో ఎంత నీరు తాగినా.మండే ఎండ‌ల కార‌ణంగా శ‌రీరంలో ఉండే నీరంతా చెమ‌ట రూపంలో ఆవిరైపోతుంది.

దాంతో త‌ర‌చూ దాహం వేస్తూనే ఉంటుంది.దీనినే అతిదాహం అంటారు.

అయితే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే.సులువుగా ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మ‌రి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేయండి.సాధార‌ణంగా చాలా మంది దాహం తీర్చుకునేందుకు ఫ్రిజ్ వాట‌ర్ తాగుతుంటారు.

కానీ, ఫ్రిజ్ వాట‌ర్ ఎంత తాగినా.మ‌ళ్లీ కొద్ది సేప‌టికే దాహం వేస్తుంది.

అలా కాకుండా మట్టి కుండ‌లో నీరు నిల్వ చేసుకుని తాగితే.అతిదాహం త‌గ్గుతుంది.

అలాగే గంజి కూడా దాహాన్ని త‌గ్గిస్తుంది.అన్నం వండిన త‌ర్వాత వచ్చే గంజిలో ప‌చ్చి ఉల్లి ముక్క‌లు వేసి.తీసుకుంటే అతి దాహం త‌గ్గుతుంది.ఈ వేస‌వి కాలంలో కేవ‌లం నీళ్లు తాగినంత మాత్రాన దాహం తీరిన‌ట్టు అనిపించ‌దు.

అందుకే నీళ్లే కాకుండా.మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సబ్జా నీళ్లు, బార్లీ నీళ్లు కూడా త‌ర‌చూ తీసుకుంటే అతి దాహం స‌మ‌స్య త‌గ్గుతుంది.

శ‌రీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.

అలాగే ధనియాలతో త‌యారు చేసిన‌ కషాయం లో తేనె క‌లిపి తీసుకోవాలి.వేస‌విలో ప్ర‌తి రోజు ఒక క‌ప్పు చ‌ప్పున దీనిని తీసుకుంటే.అతి దాహం స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

ఇక పండ్లరసాలతోనూ దాహార్తిని తీర్చుకునే ప్రయత్నం చేయొచ్చు.ముఖ్యంగా పుచ్చ‌, క‌ర్బూజా, నారింజ, బత్తాయి, దానిమ్మ‌ వంటి పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.

ఈ పండ్ల ర‌సాలు ఎండ వేడిమి నుంచి కూడా రక్షణ క‌ల్పిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube