మహా కాలభైరవ అష్టమి రోజు ఏం చేయాలి?  

మహా కాలభైరవ జయంతినే మహా కాలభైరవ అష్టమి అని పిలుస్తారు.ప్రతి సంవత్సరం కాలభైరవ అష్టమి కార్తీక మాసంలో వస్తుంది.

TeluguStop.com - What To Do On Maha Kalabhairava Ashtami Day

ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 7 సోమవారం దేశవ్యాప్తంగా ఈ మహా కాల భైరవ అష్టమి వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.ఈ భూమిపై నివసించేటువంటి ప్రతి ఒక్క ప్రాణిని తనలోకి లయం చేసుకుని ఉన్న ఆ పరమశివుడి మరొక రూపమే ఈ కాలభైరవ రూపం.

ఈ భైరవుడు కాలము అనే ఒక శునకాన్ని వాహనంగా ఉపయోగించడం వల్ల ఈ భైరవుడు కి కాలభైరవుడు అనే పేరును పెట్టారు.

TeluguStop.com - మహా కాలభైరవ అష్టమి రోజు ఏం చేయాలి-General-Telugu-Telugu Tollywood Photo Image

సాక్షాత్తు ఆ పరమశివునికి రూపమైన ఈ కాలభైరవుని కాలభైరవ అష్టమి రోజు పూజించడం వల్ల సమస్త బాధలు, సర్వపాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసము.

కాలభైరవ అష్టమి రోజు దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు.అష్టమి రోజు స్వామి వారికి ఎంతో ఇష్టమైన కర్పూర తైల అభిషేకాన్ని తప్పకుండా నిర్వహించాలి.

అలాగే స్వామివారికి గారెలతో చేసిన మాలలు వేసి, కొబ్బరి, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి.స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ నైవేద్యాన్ని సమర్పించి పూజించడం ద్వారా జాతక దోషాలు తొలగిపోతాయి.

అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న శని దోషాలు తొలగిపోవాలంటే నల్లటి 8 మిరియాలను ఒక తెల్లటి వస్త్రంలో కత్తి వత్తి మాదిరి తయారుచేసుకొని ఆ వత్తులను నువ్వుల నూనెతో వెలిగించడం ద్వారా అష్టమ, అర్ధాష్టమ, వంటి శని దోషాలు తొలగిపోయి, ఎన్నో ఏళ్లుగా ఉన్న శని నుంచి ముక్తి లభిస్తుంది.అంతేకాకుండా ఈ కాలభైరవ అష్టమి రోజు స్వామివారికి ఆవుపాలతో అభిషేకం చేసిన, పెరుగన్నం, తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి ప్రత్యేక దర్శనం చేసుకోవటం ద్వారా అకాల మరణ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఈ విధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ కాలభైరవ అష్టమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

#Karthika Masam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

What To Do On Maha Kalabhairava Ashtami Day Related Telugu News,Photos/Pics,Images..