ATM పాస్ వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి?

కరెన్సి బ్యాన్ చేసినప్పటి నుంచి డిజిటల్ మనీ వాల్యూ అమాంతం పెరిగిపోయింది.డెబిట్, క్రెడిట్ కార్డులు లేనిదే నెల గడిచేలా లేదు.

 What To Do If You Forget Atm Password?-TeluguStop.com

హైదరాబాద్ లో లిక్విడ్ క్యాష్ కోసం జనాలు ఇంకా తంటాలు పడుతూనే ఉన్నారు.మరి ఇలాంటి పరిస్థితులలో మనం ATM పాస్ వర్డ్ మరచిపోతే ఎలా? కార్డు బ్లాక్ చేస్తారా? లేదంటే కొత్త కార్డు తీసుకుంటారా? అంత సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు.అసలు మీ కార్డుని బ్లాక్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు.మరి ఏం చేయాలి ? పాస్ వర్డ్ ని ఎలా మార్చుకోవాలి?

మీ ఏటిఎమ్ కార్డు ఎలాగో మీ దగ్గరే ఉంటుందిగా.మీ అకౌంట్ నంబర్ గుర్తుపెట్టుకోండి.అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కి ఏదైతే ఫోన్ నంబర్ లింక్ చేసారో, ఆ నంబర్ ఉన్న మొబైల్ మీతో పాటే ఉంచుకోని మీ బ్యాంకుకి సంబంధించిన ఏటిఎమ్ లోకి వెళ్ళండి.

ఆ తరువాత ఏం చేయాలంటే.

* మీ కార్డుని ఇన్సర్ట్ చేసిన తరువాత Banking / బ్యాంకింగ్ ఆప్షన్ ని ఎందుకోండి

* Pin Generate లేదా Pin Reset ఆప్షన్ మీద క్లిక్ చేయండి

* ఇప్పుడు మీ అకౌంట్ నంబర్ ని అడుగుతుంది.

ఎంటర్ చేయండి

* మీరు అకౌంట్ కి లింక్ చేసిన ఫోన్ నంబర్ అడుగుతుంది.ఎంటర్ చేయండి

* ఇప్పుడు మీ మొబైల్ కి ఓ OTP (One time password) వస్తుంది.

ఆ OTP ని ఎంటర్ చేయండి

* కొత్త పాస్ వర్డ్ ని అడుగుతుంది.ఈసారైనా బాగా గుర్తుండే పాస్ వర్డ్ పెట్టుకోండి.

వెంటనే కొత్త పాస్ వర్డ్ యాక్టివేట్ అయిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube