ఆకుకూర‌లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా? ఇలా చేస్తే స‌రి!

ఆకుకూర‌లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఆకుకూర‌ల్లో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు దాగి ఉంటాయి.

 What To Do If The Leafy Vegetables Need To Be Stored For More Days! Leafy Vegeta-TeluguStop.com

అందుకే ఆకు కూర‌ల‌ను అంద‌రూ డైట్ లో చేర్చుకుంటుంటారు.అయితే త‌ర‌చూ మార్కెట్‌కు వెళ్లే ప‌ని లేకుండా చాలా మంది వారానికి స‌రిప‌డా ఆకు కూర‌ల‌ను ఒకే సారి తెచ్చుకుంటుంటారు.

కానీ, ఎక్కువ మొత్తంలో ఆకు కూర‌ల‌ను కొనడం వల్ల అవి వారం పాటు తాజాగా ఉండ‌నే ఉండ‌వు.

మనం ఎంత జాగ్రత్తగా ఫ్రిజ్‌లో పెట్టినప్పటికీ ఆకు కూర‌లు ఇట్టే వాడిపోతుంటాయి.

అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఆకు కూర‌లను ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకోవ‌చ్చు.మ‌రి లేట్ చేయ‌కుండా ఆ టిప్స్ ఏంతో చూసేయండి.

సాధార‌ణంగా చాలా మంది ఆకుకూర‌ల‌ను ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెడుతుంటారు.అలా కాకుండా టిష్యూ పేపర్ లో ఆకు కూర‌ల‌ను చుట్టి పెట్టుకుంటే మంచిది.

త‌ద్వారా తేమ మొత్తం తగ్గి ఆకుకూరలు తాజాగా ఉంటాయి.

పుదీనా, కొత్తిమీర వంటి ఆకు కూర‌లు అయితే కాడ‌లు క‌ట్ చేసేసి గాలి చొర‌బ‌డ‌ని డ‌బ్బాలో పెట్టి ఫ్రిజ్ లో  పెట్టుకోవాలి.ఇలా చేస్తే ఎక్కువ రోజుల పాటు అవి నిల్వ ఉంటాయి.

అలాగే గోరు వెచ్చ‌ని నీటిలో ఆకు కూరలను వేసి రెండు నిమిషాల పాటు ఉంచాలి.

ఆ తర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా కడిగి, నీరు లేకుండా వంపేసి టిష్యూ పేపర్లలో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టు కోవాలి.ఇలా చేస్తే ఆకు కూర‌లు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.

ఇక ఆకు కూర‌లు ఫ్రిజ్‌లో పెట్టిన‌ప్పుడు.వాటికి ద‌గ్గ‌ర‌గా పండ్లు లేకుండా చూసుకోవాలి.

ముఖ్యంగా ఇథిలీన్‌ విడుదల చేసే యాపిల్స్‌, క‌ర్బూజా, ఆప్రికాట్స్ వంటి పండ్ల‌ను ఆకు కూర‌ల‌కు దూరంగా ఉంచాలి.లేదంటే ఆకు కూర‌లు పాడైపోతాయి.

What To Do If The Leafy Vegetables Need To Be Stored For More Days! Leafy Vegetables

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube