బిపీ సమస్య ఉంటే ఇంట్లో చేయాల్సిన పనులు  

What To Do At Home If You Suffer High Bp -

హైబిపి సమస్య చాలామందికి ఉంటుంది.లెక్కపెట్టాలే గాని, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు.

వీరికి కోపతాపాలు ఎక్కువ, బాగా ఎమోషనల్ .ఎందుకంటే రక్తం అవసరానికి మించిన వేగంతో పరిగెడుతోంది.అందుకే దీన్ని హై బ్లడ్ ప్రెషర్ అని అంటారు.మరి ఈ సమస్యకి చికిత్స కేవలం బీపీ గోలీలు మింగడమేనా? ఇంట్లో మనవంతుగా ఎలాంటి జాగ్రత్తలు చికిత్సలు వద్దా?ఉన్నాయండి .మీరు పాటించండి చాలు.

What To Do At Home If You Suffer High BP-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

* మన భారతీయులకి ఉప్పు తినే అలవాటు ఎక్కువ.

చప్పటి కూడుని తినడం కూడా అవమానకరంగా భావిస్తారు.ఉప్పు కారం తక్కువ తిన్నవారిని వెక్కిరిస్తారు.

ఉప్పు తినకూడదని కాదు, కాని ఎంత? లిమిట్ లో తినకపోతే ఎలా? పచ్చళ్ళు అని, పిండివంటలు అని అవసరానికి మించిన ఉప్పు తినేస్తాం.దీంతో సోడియం లెవెల్స్ పెరిగిపోయి హై బ్లడ్ ప్రెషర్ మొదలవుతుంది.

కాబట్ట సాధ్యమైనంతవరకు ఉప్పు తక్కువ తినండి.

* ఇంతకుముందే తిండి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మంచి తిండి చాలా అవసరం.

ఫ్యాట్స్ ఎక్కువగా లేని ఆహారాలు, సోడియం ఎక్కువగా లేని ఆహారాల మీద దృష్టి కేంద్రీకరించండి.ఒకవేళ సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటే, పొటాషియం ఎక్కువ ఉండే ఆహారంతో బ్యాలెన్స్ చేయండి.

అరటిపండులో పొటాషియం బాగా ఉంటుంది.

* మద్యం లిమిట్ లో తాగితే ఆరోగ్యం, లిమిట్ లేక తాగితే అనారోగ్యం.

మీరు మద్యం తక్కువగా తాగితే మీ బ్లడ్ ప్రెషర్ ఏకంగా 2-4 mm hg వరకు తగ్గుతుంది.

* రోజు వ్యాయామము ఖచ్చితం.

బరువు ఎక్కువగా ఉంటే అది శ్వాస సమస్యలు తీసుకొచ్చి, బ్లడ్ ప్రెషర్ ని తీసుకొస్తుంది.ఆక్సిజన్ తక్కువగా అంది, బ్లడ్ ప్రెషర్ మాత్రం ఎక్కువగా ఉండటం ప్రమాదకరం.

అందుకే రోజు వ్యాయామము చేయండి.బరువు తక్కువగా ఉండేలా చూసుకోండి.

* అధికంగా కాఫీ తాగితే కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.ఎక్కువ కెఫైన్ తీసుకుంటే 10mm hg వరకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది.కాబట్టి కాఫీ ప్రియుల్లారా .బిపి తగ్గాలంటే కాఫీ కూడా తగ్గాలి.

* సిగరెట్ అలవాటు కూడా బీపిని విపరీతంగా పెంచుతుంది.స్ట్రెస్ తీసుకోవడం, భయానక సంఘటనలు పదే పదే చూడటం కూడా బీపిని పెంచుతాయి.వీటికి కూడా దూరంగా ఉండండి.అప్పుడే మీ బీపి గోలీలు మంచి పనితనాన్ని చూపిస్తాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

What To Do At Home If You Suffer High Bp- Related....