అయ్యో పాపం ! ఈ యువతి అనుకున్నది ఒక్కటి అయ్యింది మరొక్కటి.. !

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది రాత్రికి రాత్రే ఒక సెలెబ్రిటీలుగా మారిపోయిన విషయం మనకు తెలిసిందే.సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకోవాలని చాలామంది ఆశ పడుతూ ఉంటారు.

 What This Young Woman Thought Became One Thing And Another . Women, Dance, Viral-TeluguStop.com

ఈ క్రమంలోనే రకరకాల విన్యాసాలు చేసి అనుకోని చిక్కుల్లో పడతారు.ఈ నేపథ్యంలో ఒక యువతి కూడా ఇలానే ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేయాలనే తపనతో ఒక పని చేసింది.

ఫేమస్ అవ్వడం మాట పక్కన పెడితే అనుకోని ఇబ్బందులతో పాటు నెటిజన్లతో తిట్లు కూడా తిన్నది.ఆ యువతి అనుకున్నది ఒక్కటి జరిగింది ఒక్కటి దీన్నే బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అని.ఇంతకీ ఆ యువతి చేసిన పని ఏంటి అనే వివరాలు ఒకసారి చూద్దామా.

ఒక యువతి సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకోవాలనే తాపత్రయంతో నడి రోడ్డుపై రెచ్చిపోయి డాన్స్ వేసింది.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగినది.ప్రస్తుతం ఈ యువతి నడి రోడ్డుపై చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఆ యువతి పేరు శ్రేయా కల్రా.ఈ యువతి దాదాపు మూడు రోజుల క్రితం ట్రాఫిక్ రద్దీగా ఉండే రోడ్డు మీద అందరు చూస్తుండగానే చిందులు వేసింది.

ట్రాఫిక్ సిగ్నల్ వద్దా రెడ్‌ సిగ్నల్‌ పడటంతో వాహనాలు ఎక్కడివి అక్కడ ఆగిపోవడంతో ఈ యువతి సడెన్ గా రోడ్డు మీద కొచ్చి ముఖానికి మాస్క్‌ వేసుకొని తిన్మార్ స్టెప్పులేసి రచ్చ రచ్చ చేసింది.

Telugu Dance, Latest-Latest News - Telugu

కాగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద వేచి ఉన్న వారు అందరు యువతి ప్రవర్తన, డాన్స్ చూసి విస్తుపోయారు.ఇన్‌స్టాగ్రామ్‌ కోసం చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.కానీ ఈ వీడియో ఇప్పుడు ఆమెకు అనుకోని ఇబ్బందులు తెచ్చిపెట్టిందని చెప్పాలి.

ట్రాఫిక్‌ రూల్స్ పాటించకుండా, రోడ్డు పై డాన్స్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన కారణం చేత ఆమెకు పోలీసులు నోటీసులు జారీచేశారు.అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఈ యువతిపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.అనుకున్నది ఒకటి అయింది ఒకటి.బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అంటే ఇదే కాబోలు.!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube