ఏంటి నిజామా.. రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ ఇద్దరు ప్రమాదంలో చనిపోయేవారా?

తెలుగు సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి అందరికీ పరిచయమే.ఈయన సీనియర్ నటుడు దేవదాస్ కనకాల కుమారుడు.

 What This Is Real Rajeev Kanakala And Ntr Got An Accident Details,  Jr Ntr, Raji-TeluguStop.com

ఇక బుల్లితెర యాంకర్ సుమను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇక రాజీవ్ కనకాల వెండితెరపై, బుల్లితెరపై నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తున్నాడు.

ఈయన 1991 లో బాయ్ ఫ్రెండ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.ఆ తరువాత 2001 లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అలా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుని విలన్, సహాయ పాత్రలలో నటించాడు.ఈమధ్య బాగా పవర్ఫుల్ ఉన్న పాత్రలలో కూడా నటిస్తున్నాడు.ఈయన వెండితెర కంటే ముందు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించాడు.

ఇక ఈ ఏడాది వరుస సినిమాలతో బాగా బిజీ గా మారాడు.

ఇదిలా ఉంటే ఈయనకు ఎన్టీఆర్ కు మధ్య మంచి స్నేహ బంధం ఉంది.తమ మధ్య మంచి స్నేహం ఉన్న విషయాన్ని చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలలో తెలిపారు.

ఇప్పటికీ వీరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది.వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో కూడా నటించారు.

గతంలో వీరిద్దరు కలిసి కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పాల్గొన్నారు.

Telugu Jr Ntr, Ntr Person, Ntr Naga, Rajeevkanakala, Rajiv Kanakala, Suma Kanaka

ఎన్టీఆర్ తనకు బాగా ధైర్యం చెబుతాడని.15 ఏళ్ల నుంచి తమ మధ్య స్నేహబంధం ఉందని అన్నారు.ఎన్టీఆర్ ఎమోషనల్ పర్సన్ అని అంతేకాకుండా ఫ్యామిలీ పార్సల్ అని కూడా తెలిపాడు.

ఇదిలా ఉంటే వీరిద్దరు ఓ ప్రమాదంలో చనిపోయే వారట.అదేంటి వీరిద్దరి చనిపోవడం ఏంటి అనుకుంటున్నారా.

నిజమే వీరిద్దరూ పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారని గతంలో రాజీవ్ కనకాల తెలిపాడు.

Telugu Jr Ntr, Ntr Person, Ntr Naga, Rajeevkanakala, Rajiv Kanakala, Suma Kanaka

రాజీవ్ కనకాల ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ గురించి పక్క మాట్లాడుతాడు.ఎన్టీఆర్ కూడా రాజీవ్ కనకాల గురించి చెబుతుంటాడు.ఇక రాజీవ్ కనకాల గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ లో కొన్ని విషయాలు పంచుకున్నాడు.

తాము ఇద్దరు కలిసి నాగ సినిమాలో నటించామని తెలిపాడు.ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో రైలు పైన యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆ రైలు కదిలిందని.

దీంతో ఇద్దరం కింద పడి పోయామని తెలిపాడు.

Telugu Jr Ntr, Ntr Person, Ntr Naga, Rajeevkanakala, Rajiv Kanakala, Suma Kanaka

ఇక ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ఇనప రాడ్ ను పట్టుకొని బయటపడ్డామని లేదంటే అక్కడికక్కడే చనిపోయే వాళ్ళమని తెలిపాడు రాజీవ్ కనకాల. ఇక ఈ విషయం చాలా వరకు ఎవరికీ తెలియదని అన్నారు.గతంలో వీరిద్దరికీ మరో చోట కూడా ప్రమాదం జరిగింది.2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో తాము ప్రయాణిస్తున్న కారు ప్రమాదం జరగగా అందులో రాజీవ్ కనకాల కూడా ఉన్నాడు.

అలా మొత్తానికి వీరిద్దరికీ రెండు సార్లు ప్రమాదం జరిగిందని అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube