పాత నోట్ల వ్యాపారంపై ఆర్బీఐ ఏం చెప్పిందంటే...

భారత దేశంలో ఉన్న బ్యాంకులకు ఆర్బీఐ పెద్దన్న అనే విషయం అందరికీ తెలిసిందే.బ్యాంకులు ఎలా మసులుకోవాలో ఎలా నడుచుకోవాలనేది మొత్తం ఆర్బీఐ సూచించిన విధంగానే జరుగుతుంది.

 What The Rbi Has To Say About The Old Note Business , Rbi , Old Note Business, F-TeluguStop.com

ఆర్బీఐ ఎంత చెబితే బ్యాంకులకు అంత అనేది దేశంలో చాలా మందికి తెలుసు.గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న బ్యాంకులే కాకుండా ప్రైవేటు సెక్టార్ లో ఉన్న బ్యాంకులు కూడా ఆర్బీఐ మాట వినాల్సిందే.

ప్రస్తుత రోజుల్లో కొన్ని వెబ్ సైట్లు పాత నోట్లను నాణేలను తీసుకుని అధిక ధరను చెల్లిస్తామని ప్రచారం చేసుకుంటున్నాయి.అలాంటి వాటి ప్రకటనలు నమ్మి మోసపోకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

కొన్ని వెబ్ సైట్లు తమ అనుమతి కూడా ఉందని ప్రచారం చేసుకుంటున్నాయని అటువంటి ప్రచారాలను నమ్మొద్దని వినియోగదారులను హెచ్చరించాయి.ఇలాంటి ప్రకటనలు చూసి ఆర్బీఐ అనుమతి ఉంది కదా అని చాలా మంది వ్యక్తులు ఆ ఫేక్ వెబ్ సైట్లను నమ్మి మోసపోతున్నారు.

ఈ విషయం ఆర్బీఐ దృష్టికి పోవడంతో స్పందించింది.

తాము ఇలా పాత నోట్లను కొనుగోలు చేసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

తమ పేరు చెప్పుకుని కొన్ని సంస్థలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆర్బీఐ అధికారులు తెలిపారు.తాము ప్రజల వద్ద నుంచి కమిషన్లు తీసుకునేందుకు ఏ సంస్థకు అనుమతి ఇవ్వలేదని వారు తెలిపారు.

ఇలా పాత నోట్ల దందా వల్ల అనేక మంది అమాయకులు మోసపోతున్నారని ఆర్బీఐ అధికారులు ప్రకటించారు.ఇలా తమ పేరు వాడుకుని అమాయకులను మోసం చేయడాన్ని ఆర్బీఐ తప్పు పట్టింది.

ఇలాంటి వారి పట్ల జాగ్రత్తలు వహించాలని ఆర్బీఐ అధికారులు తెలిపారు.కావున బ్యాంకు వినియోగదారులు కూడా ఇలా పాత నోట్లకు అధికంగా డబ్బులు చెల్లిస్తామని చెప్పే వారి పట్ల అటువంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్తగా మెదులుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube