వాట్ ది లైఫు...అబ్బాయి అంటేనే నైఫు...అంటూ విజయ్ దేవరకొండ పాటకు ఫిమేల్ వెర్షన్ అదుర్స్.!

విజయ దేవరకొండ “గీత గోవిందం”సినిమాలో పాడిన పాట ఎంత వివాదంగా మారిందో అందరికి తెలిసిందే.వాట్ ది ఎఫ్ అంటే ఫేస్బుక్ లో ఓ రేంజ్ లో ట్రోల్ల్స్ వచ్చాయి.

 What The Life Abbayi Ante Knife Song Gone Viral-TeluguStop.com

ఆడియో లాంచ్ లో ఆ ట్రోల్ల్స్ ను స్టేజి పై ప్రెసెంట్ చేసారు విజయ్.ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.

‘గీతా గోవిందం’ సినిమాలో నేను పాడిన పాట ‘వాట్ ది ఎఫ్’ ఇటీవల విడుదల చేయడంతో పెద్ద వివాదం అయ్యింది.నన్ను రెండు రోజుల పాటు ఈ పాటకోసం ఆడియన్స్‌తో పాటు వివిధ సంఘాల వారు గట్టిగా వేసుకున్నారు.

దెబ్బకి లిరిక్స్ రైటర్ శ్రీమణి గారు అండర్ గ్రౌండ్‌కి వెళ్లారు.దర్శక, నిర్మాతలు ఈ పాటను నేను పాడాలని అనడంతో పాడాను.

వాట్ వాట్ ఎఫ్.అమ్మాయిలంటే టఫ్.అని నేను పాట పాడితే.ఇలా రకరకాలుగా ఆడుకున్నారు.

మొత్తానికి లిరిక్స్‌పై అభ్యంతరాలు ఉన్నాయని మర్చేస్తున్నామ్.మార్చిన లిరిక్స్‌తో మళ్లీ నాతోనే పాడించారు.

మొత్తానికి దీనితో నా గొంతు నచ్చలేదని తేలిపోయింది.అయితే ఈ పాటను మీరే పాడండి మీతోనే పాడించుకుంటాం అది సినిమాలో పెట్టుకుంటా అంటూ ‘వాట్.

వాట్.లైఫ్’ అంటూ కొత్తగా పాడిన పాటను విడుదల చేశారు.

మొత్తానికి ‘వాట్ ది ఎఫ్’ పాటలో ‘ఎఫ్’ ప్లేస్‌లో లైఫ్‌ని యాడ్ చేశారు.

ఇది ఇలా ఉంటె…ఎంత సేపు అమ్మాయిలనే అంటారా…మా వెర్షన్ లో కూడా అబ్బాయిల పై “వాట్ ది లైఫ్.” అంటూ అబ్బాయిలను విమర్శిస్తూ “ప్రణతి” అనే యువతి ఫిమేల్ వెర్షన్ లో ఈ సాంగ్ పాడారు.అమ్మాయిలకైతే ఈ సాంగ్ తప్పక నచ్చుతుంది.

మీరు ఒక లుక్ వేయండి.

రష్మిక మందాన సరసన “విజయ్ దేవరకొండ” నాటిన గీత గోవిందం సినిమా ఈ నెలలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

రిలీజ్ కి ముందునుండే ఈ సినిమాకి హిట్ టాక్ వినిపిస్తుంది.ఏమవుతుందో తెలియాలంటే వేచి చూడాలి.

ఈ లోపు అయితే ఈ వీడియో చూసేయండి!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube