బాబు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడేమంటారు?

ఏపీ పరిషత్ ఎన్నికలు జరుగుతున్న తీరుకు వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసనగా ఆ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.ఇప్పటికే నామినేషన్‌ వేసిన వారు కూడా వెనక్కు తీసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఆదేశించడంపై మిశ్రమ స్పందన వచ్చింది.

 What Telugu Desham Party Leaders Now Talk About Chandra Babu Naidu-TeluguStop.com

ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొని తీరాలి.ఇలా ఎన్నికలన బహిష్కరించడం అంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనట్లుగా వ్యవహరించడమే అంటూ సొంత పార్టీ నాయకులు స్వయంగా చంద్రబాబు ను విమర్శించారు.

కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి తీరుతాం అంటూ తెలుగు తమ్ముళ్లు అన్నారు.తాజాగా ఎన్నికలపై కోర్టు స్టే విధించడంతో చంద్రబాబు నాయుడు నిర్ణయం సరైనదే అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు దేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించిన నేపథ్యంలో వైకాపా ఏకపక్షంగా నూరు శాతం విజయాలను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా భావించారు.కాని అనూహ్యంగా కోర్టు నిర్ణయంతో వైకాపా ఖంగు తిన్నది.

బాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన తమ్ముళ్లు నోరు మూసుకుని మరోసారి మా బాబు గ్రేట్‌ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube