నిద్ర లేవగానే మొదట ఏమి చూస్తే మంచిది?  

What Should We Look At First When We Got Up-నిద్ర లేవగానే,నిద్ర లేవగానే మొదట ఏమి చూస్తే మంచిది

మన పనులు సక్రమంగా జరుగుతున్నాయంటే ఈ రోజు ఎవరి ముఖం చూసామో అని అనుకోవటం సహజమే. నిద్ర లేవగానే ప్రశాంతమైన దృశ్యాన్ని చూస్తే ఆ రోజు ఎటువంటి ఆడ్డంకులు లేకుండా సంతోషంగా గడిచిపోతుంది. అంతేకాక ఉత్సాహంగా కూడా ఉంటుంది..

నిద్ర లేవగానే మొదట ఏమి చూస్తే మంచిది?-What Should We Look At First When We Got Up

అదే నిద్ర లేవగానే మనస్సును బాధించే దృశ్యాన్ని చూస్తే ఆ రోజంతా చికాకుగా ఉంటుంది. అసలు నిద్ర లేవగానే ఏమి చూస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటుందో తెలుసుకుందాం .నిద్ర మెలకువ రాగానే ముందు ప్రశాంతంగా దీర్ఘ శ్వాసను తీసుకోవాలి.

రెండు అర చేతులనూ ముఖం పై ఉంచి నెమ్మదిగా అరచేతులవైపుకి చూస్తూ కింది శ్లోకాన్ని పఠించాలి.

శ్లోకం – కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే తు గోవిందా ప్రభాతే కరదర్శనం |

అటుపైన భగవంతుని వైపు చూసి నిద్రలేవాలి.