గుడ్డులో తెల్లభాగం తినాలా లేక పసుపు భాగమా ?  

What Should One Prefer In Egg White Or Yolk-

ఉడకబెట్టిన కోడి గుడ్డు ఎంత లాభాకరమో మనందరికీ తెలిసిందే.ఒక కోడిగుడ్డుని ఎంతసేపు ఉదాకబెడితే మంచిదో కూడా మనం తెలుసుకున్నాం.

What Should One Prefer In Egg White Or Yolk-

కాని చాలామందికి ఇప్పటికి అర్థం కాని విషయం ఏమిటంటే, ఉడకబెట్టిన కోడిగుడ్డులో ఏ భాగం మంచిది ? తెల్లదా లేక పసుపు రంగులోదా ? దేన్నీ ఎక్కువ తినాలి ? ఎగ్ వైట్ నా లేక యోల్క్ నా ? మామూలుగానైతే ఉడకబెట్టిన గుడ్డుని అలానే తినేస్తాం .అలా తినడం మంచిదేనా ? ఎగ్ వైట్ , యోల్క్ .రెండిట్లో ఏది బెట్టర్ ? రెండిట్లో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువగా సహాయపడుతుంది ?

కాస్త రెండిటి న్యూట్రిషన్ వాల్యూస్ చెక్ చేస్తే, తెల్లభాగం లో 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటే, పసుపు భాగంలో 2.7గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.అంటే వైట్ లోనే ప్రోటీన్లు ఎక్కువ.వైట్ లో కేవలం 0.05 గ్రాముల ఫ్యాట్ ఉంటే, యోల్క్ లో మాత్రం 4.5 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది.వైట్ లో కేవలం 16 కాలరీలు ఉంటాయి, కాని యోల్క్ లో 54 కాలరీలు ఉంటాయి.

What Should One Prefer In Egg White Or Yolk-

కొలెస్టరాల్ వైట్ లో సున్నా .కాని యోల్క్ లో మాత్రం 211.కాల్షియం యోల్క్ లోనే ఎక్కువ.అలాగే ఫాస్ ఫరస్ కూడా.పొటాషియం, సోడియం, రిబో ఫ్లవిన్ వైట్ లో ఎక్కువ ఉంటే, జింక్, సేలేనియం, థియామిన్, ఫోలేట్, బి 12 యోల్క్ లో ఎక్కువ ఉంటాయి.విటమిన్స్ కూడా యోల్క్ లోనే ఎక్కువ.

ఈ న్యూట్రిషన్ లెక్కలు చూస్తే మనిషి శరీరానికి రెండు అవసరమే.రెండింట్లో మనకు లాభాలు చేకూర్చే ఎలిమెంట్స్ ఉన్నాయి … కాని యోల్క్ ని ఎక్కువ తినొద్దు అని ఎందుకు అంటారంటే … యోల్క్ లో కొలెస్టరాల్ లెవల్స్ ఉండటం వలన, ఫ్యాట్స్ ఎక్కువ ఉండటం వలన, దాంతో పాటు వైట్ కన్నా ఎక్కువ కాలరీలు ఉండటం వలన.

ఒకవేళ అధిక బరువు సమస్య ఉన్నవారు ఉన్నారండుకోండి .అలాంటివారు గుడ్డులో కేవలం వైట్ తీసుకుంటే సరిపోతుంది.మరి యోల్క్ తీసుకోవాలా వద్ద అనేది వారి డైట్ బ్యాలెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది.ఇక కొలెస్టరాల్ సమస్యతో ఇబ్బందిపడేవారు యోల్క్ ని తీసుకోకపోవడమే మంచిది.

అసలు ఏ సమస్యలు లేని వారు తమ డైట్ లోకి ఉడకబెట్టిన గుడ్డుని చేర్చుకోవాలంటే … వారం రెండుమూడు రోజులు మాత్రమే పూర్తీ గుడ్డుని తిని, మిగితా రోజులు కేవలం వైట్ తో కానిచ్చేస్తే మంచిది అని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు