ఎన్టీఆర్ చనిపోయే గంట ముందు ఇంత కథ జరిగిందా?

ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం సృష్టించిన గొప్ప నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.ఈ పేరు వింటేనే మనసులో ఏదో తెలియని చలనం వస్తుంది.

 What Really Happened That Ntr Last Day At Midnight, Senior Ntr, Lakshmi, Last Da-TeluguStop.com

తెలుగు నాట తన నటనతోనే కాదు రాజకీయంలో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నిజమైన నాయకుడు ఎన్టీఆర్.అందుకే తెలుగు ప్రజలు ఇప్పటికీ ఆయన్ని అన్నగారు అని అభిమానంగా పిలుచుకుంటారు.

ఇకపోతే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన వెన్నుపోటు అని చాలా మంది చెబుతూ ఉంటారు.వాటికి సరైన ఆధారాలు మాత్రం ఎవరికి తెలియవు.

ఇక ఆయన చనిపోయే గంట ముందు ఏం జరిగింది అనే విషయాలు ఇప్పటికీ గోప్యంగానే ఉంటాయి.

ఇకపోతే అప్పటి జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు అనే  వ్యక్తి ద్వారా ప్రస్తుతం ఆ చివరి గంటలో ఏం జరిగింది అనే విషయాలు సంచలనంగా మారుతున్నాయి.

ఆయన చెప్పిన దాని ప్రకారం తాను ఢిల్లీలో ఉద్యోగం చేసే సమయంలో సంక్రాంతి పండుగకి తన ఇంటికి వచ్చానని ఆయన అన్నారు.జనవరి 17న బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 13 లో ఉన్న ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లానని ఆయన అన్నారు.

ఆయన భార్య లక్ష్మి పార్వతిని కలిసి చాలా గంటలు అక్కడే గడిపానని ఆయన చెప్పుకొచ్చారు.ఎంతైనా మహానటుడు కదా.ఆయనలో ఉన్న ఆవేదనను బయటకు కనబడకుండా నటించేసారు.

Telugu Lakshmi, Days, Senior Ntr, Tollywood-Movie

సాయంత్రం 5:00 అయింది అన్నగారి ముఖంలో తీవ్రమైన ఆందోళన.అలాగే 6:00 కూడా అయ్యింది.తెలుగుదేశం పార్టీ అధికార అడ్వకేట్లు జాస్తి చలమేశ్వర్ ఎస్.వి.రమణ శ్రీనివాసరావు, అన్న గారి దగ్గరికి వచ్చినపుడు, ఎన్టీఆర్ ఏమైంది బ్రదర్స్ అని అనగానే దానికి వాళ్లు సమాధానంగా సర్ హైకోర్టులో మనం కేసు ఓడిపోయాం.తెలుగుదేశం బ్యాంకు ఖాతాలు అన్నీ చంద్రబాబు పార్టీకి చెందుతాయని బ్యాంకుల్లో మీ సంతకాలు చెల్లవని తీర్పు వచ్చినట్టు వాళ్ళు తెలిపారు.ఆందోళనకు గురైన ఎన్టీఆర్ ఒక్కసారిగా లేచి దరిద్రులు, చెండాలులు అని అరిచారట.

ఆదరించి మంత్రిని చేస్తే ఇంత అన్యాయం చేశారు అని బోరున విలపించారట.అలాగే తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోయారట.

ఇక లోపల గడియ పెట్టుకున్నారు.తాను, లక్ష్మీపార్వతి, అశోక్ ఎంత పిలిచినా తలుపు తీయలేదు.

Telugu Lakshmi, Days, Senior Ntr, Tollywood-Movie

రాత్రి 8 గంటల సమయంలో తలుపు తీసి గదిలో ఉన్న వస్తువులన్నీ నేలకు కొట్టి జీవితంలో మోసపోయానని ఏడుస్తూనే ఉండిపోయారట.భోజనం కూడా చేయలేదట.9:00 అయింది లక్ష్మీ పార్వతి తన దగ్గరికి వచ్చి అన్నగారికి ఎక్కిళ్ళు వస్తున్నాయి.మంచి నీళ్లు తాగడం లేదు.

అందరూ రండి అని పిలిచారట.వెళ్లి నీళ్లు తాగిస్తే తాగారట.

కానీ ఎక్కిళ్ళు మాత్రం ఆగలేదు.ఏడుపు కూడా ఆపలేదు.

ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపొండి అని ఆదేశాలు జారీ చేశారు ఎన్టీఆర్.దాంతో బయటకు వచ్చేసాం.1:00 వరకు ఆయన ఇంట్లోనే ఉన్నానని రమేష్ తెలిపారు.ఆ తర్వాత తాను ఇంటికి వెళ్లానని, ఇంటికి వెళ్ళిన కాసేపటికి లక్ష్మీ పార్వతి నుంచి ఫోన్ రాగానే మళ్ళీ వెంటనే తిరిగి ఎన్టీఆర్ గారి ఇంటికి వచ్చి చూసేసరికి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యానని, ఆయన ఎన్టీఆర్ తో గడిపిన గత స్మృతులను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube