కర్ణాటకలో బీజేపీ తరపున ప్రచారానికి పవన్‌ కండీషన్స్ ఏంటి?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )కర్ణాటక లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి.బిజెపి తో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ కర్ణాటక లో బిజెపి( BJP ) అభ్యర్థుల కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

 What Pawan Kalyan Get From Bjp After Karnataka Election ,pawan Kalyan , Karnata-TeluguStop.com

ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వెళ్లిన సమయం లో బిజెపి పెద్దలు ఈ విషయమై విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది.

అందుకు పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పారట.అయితే రాజకీయాల్లో ఇచ్చి పుచ్చుకోవడాలు కామన్ గా జరుగుతూ ఉంటాయి.కర్ణాటక లో బిజెపి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తే ఆయనకి దక్కే లాభం ఏంటి అనేది ఆసక్తికర చర్చగా సాగుతోంది.

పవన్ కళ్యాణ్ రాజకీయాల కి కొత్త.అయినా కూడా ఆయన కు బిజెపి సముచిత స్థానం కల్పిస్తుంది అనడం లో సందేహం లేదు.అందుకే కర్ణాటక లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి మంచి ఫలితాలు వస్తే కచ్చితంగా ఆయనకి అందుకు తగ్గట్లుగా గౌరవం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఏం కోరుతాడు అనేది చూడాలి.

ఏపీ లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.ఆ సమయం లో పవన్ కళ్యాణ్ రివర్స్ గిఫ్ట్ కోరే అవకాశం ఉంది.అప్పుడు బిజెపి నుండి వచ్చే స్పందన ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ( TDP ) తో కలిసి వచ్చే సంవత్సరం ఎన్నికలకు వెళ్లాలని కోరుకుంటున్నాడు.

అయితే బిజెపి మాత్రం అందుకు నో చెబుతోంది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపి లో ఏమైనా మార్పు వచ్చిందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube