పెళ్లి అయినా తర్వాత అమ్మాయి అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఎందుకు ఏడుస్తుంది?       2018-04-26   02:17:51  IST  Raghu V

అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి అనేది వారి జీవితంలో కీలకమని చెప్పాలి. పెళ్ళికి ముందు అమ్మాయిలు పుట్టింటిలో చాలా గారాబంగా,ప్రేమానురాగాలతో పెరుగుతారు. అయితే ఎదో ఒక రోజు ప్రతి ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళవలసిందే. ఆ సమయంలో ప్రతి ఆడపిల్లకు పెళ్లి జరుగుతుందనే ఆనందం ఒక వైపు, అమ్మ,నాన్న,సోదరులను వదిలి వెళ్లుతున్నాననే బాధ ఒక వైపు ఉండటం సహజమే.

ముఖ్యంగా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అనే భయం ఉంటుంది. అలాగే పెళ్లి చేసుకున్న భాగస్వామి ఎలా ఉంటాడో అనే కలవరం,బాహ్యం ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు తల్లితండ్రులను వదిలి ఒక క్షణం కూడా వదిలి ఉండలేరు. అలాంటి వారికీ అత్తారింటికి వెళ్లి ఉండటం మొదట్లో కష్టంగానే ఉంటుంది.

పెళ్లి అయిన తర్వాత అమ్మాయి అత్తారింటికి వెళ్లే సమయంలో తల్లి తండ్రులను పట్టుకొని ఏడుస్తుంది. ఎందుకంటే అప్పటివరకు పుట్టినప్పటి నుండి పెళ్లి అయ్యేవరకు తల్లితండ్రులను వదిలి ఎక్కువ రోజులు ఎక్కడ ఉండకపోవటం మరియు పుట్టింటిలో అందరిని వదిలి వెళ్ళటం కూడా పెళ్లి అయిన అమ్మాయికి బాధగా ఉంటుంది. అయితే ఆ తర్వాత మెల్లిగా అత్తారింటిలో అలవాటు అయ్యిపోతుంది.