ఏం అదృష్టం భయ్యా.. దొరికిన 53 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న పర్సు

ప్రస్తుత కాలంలో మనం జాగ్రత్తగా దాచి పెట్టుకున్న వస్తువే మన దగ్గర ఉండటం లేదు.ఇళ్ళను ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది.

 What A Luck Lost Purse Of Scientist Grisham Found After 53 Years, Viral News,lat-TeluguStop.com

ఎక్కడైనా బయట ప్రదేశాల్లో ఏదైనా అంటే ఉదాహరణకు సెల్ ఫోన్ ను ఒక పది నిమిషాలు అలా వదిలేసి వెళ్తే అది మాయమైపోతుంది.ఎవరో ఒక మహాత్ముడు దానిని కాజేస్తాడు.

ఇంట్లో, బయట రక్షణ లేని పరిస్థితులలో ఓ వ్యక్తికి 53 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న పర్సు దొరికింది.ఇక అతని ఆనందానికి అవధులు లేవనే చెప్పవచ్చు.

ఇక అసలు విషయంలోకి వస్తే కాలిఫోర్నియాలోని శాన్ డియోగోకు చెందిన గ్రిశామ్ అనే వ్యక్తి 1967 సంవత్సరంలో ఒక సంవత్సరం పాటు అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో శాస్త్ర వేత్తగా పనిచేసిన సమయంలో తన పర్సు పోగొట్టుకున్నట్టు గమనించాడు.కాని అది ఎంత వెతికిన దొరకకపోవడంతో ఇక వెతకడాన్ని ఆపేసాడు.

అయితే అంటార్కిటికా లోని రాస్ ఐల్యాండ్ లోని పాత భవనాల కూల్చివేతలో గ్రిశామ్ కు సంబంధించిన పర్సు లభించింది.ఇక స్పిరిట్ ఆఫ్ 45 అనే స్వచ్ఛంద సంస్థ గ్రిశామ్ ఆచూకీ కనుక్కొని పర్సును గ్రిశామ్ కు అందజేశారు.

ఇక 53 ఏళ్ల తరువాత పోగొట్టుకున్న పర్సు దొరకడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

Telugu Antarctica, Calinia, Latest, Purse, Scientist, Spirit, Ups-Latest News - .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube