ఈ వార్నింగ్ లు ఏంటి కేటీఆర్ ? వీళ్లనీ వదల్లేదా ?

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తన దూకుడును మరింతగా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన పేరు బలంగా వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వం లోనూ, పార్టీలను తనదైన శైలిలో ముద్ర వేయించుకునేందుకు కేటీఆర్ ఎప్పటి నుంచో సన్నద్ధమవుతున్నారు.

 What Ktr Are These Warings-TeluguStop.com

అధికారులను నాయకులను ఎప్పటి నుంచో తన అదుపు ఆజ్ఞల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే ఆయన తెలంగాణ మొత్తం తన మార్క్ కనిపించేలా నిత్యం సభలు, సమావేశాలు, పర్యటనలు చేస్తూ హడావుడి చేస్తున్నాడు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు, అధికారులకు వార్నింగ్ లు ఇస్తున్నాడు.ప్రజలు అవసరాలు తెలుసుకుని, వారి అవసరాలు తీర్చే విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని లేకపోతే పదవులు గట్టిగానే చెబుతున్నారు.

-Political

ఈ మధ్యకాలంలో కేటీఆర్ వార్నింగ్ లు ఎక్కువయినట్టుగా కనిపిస్తున్నాయి.పార్టీ సమావేశాల సందర్భంగా సొంత పార్టీ నాయకులకు అదే రకంగా హెచ్చరిస్తున్నారు.తెలంగాణ లో కొత్తగా వచ్చిన పంచాయతీరాజ్ చట్టం గురించి ప్రస్తావిస్తూ ఎవరైనా ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే పదవులు పోతాయని అందరూ జాగ్రత్తగా పనిచేయాలని, ఎక్కడ అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని హెచ్చరికలు చేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం తెలంగాణలో మున్సిపాలిటీ చైర్మన్, మేయర్ల సమావేశంలోనూ అదేరకంగా హెచ్చరికలు చేసిన కేటీఆర్ మున్సిపాలిటీలో నాటుతున్న మొక్కల విషయంలోనూ అదేరకమైన వార్ణింగ్ కార్పొరేటర్లకు ఇచ్చారు.

మొక్కలు బతక్కపోతే మీ పదవులు ఉడతాయి అంటూ హెచ్చరించారు.ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా అదే స్థాయిలో కేటీఆర్ చివాట్లు పెడుతున్నారు.హైదరాబాదులో త్వరలో జరగబోతున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడించాలని చూస్తున్న కేటీఆర్ హైదరాబాదులో ఎక్కడ పట్టు కోల్పోకుండా ఇప్పటి నుంచే నగర అభివృద్ధిపై దృష్టి సారించారు.ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష చేపడుతున్నారు.

తాజాగా జిహెచ్ఎంసి కార్యాలయం లో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.*

-Political

ఈ సందర్భంగా అనేక విషయాల గురించి కేటీఆర్ ప్రస్తావించారు.చైనాలో 10 రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించారని, కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు అంత స్పీడు ఉండడం లేదని, ఒక వంతెన నిర్మించడానికే ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారని, గుంతల రహదారులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని కాంట్రాక్టర్లపై కేటీఆర్ మండిపడ్డారు.ఈ సందర్భంగా కాంట్రాక్టర్ లను ఉద్దేశించి కేటీఆర్ హెచ్చరికలు చేశారు.

నిర్మాణాల విషయంలోనూ, నాణ్యతలోనూ ఎక్కడా రాజీ పడకుండా, అవకతవకలు లేకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

ప్రైవేటు సంస్థలకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తే మీరు మరింత నిర్లక్ష్యం వహిస్తున్నారని, మీ వల్ల అయితే చేయండి లేదంటే వదిలేయండి, మీరు తెలంగాణలో ఇంకా ఎక్కడ కాంట్రాక్టులు చేయలేరు అంటూ కేటీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా పది రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించిన చైనా సాంకేతిక పద్ధతులు ఇక్కడా తీసుకురావాలని, అవసరమైతే ఒకసారి చైనా వెళ్లి ఆ సాంకేతికతను పరిశీలించాలని సూచించారు.తనకు సాకులు చెప్పవద్దని, పనులు చేసి చూపించాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేటీఆర్ హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube