ఏరకమైన టీవీ వాడితే మంచిది? QLED, UHD, OLEDలలో ఏ స్క్రీన్ వాడితే బెస్ట్..?

ప్రస్తుత దైనందిత జీవితంలో మన ఇళ్లల్లో టీవీ అనేది ఒక భాగమైపోయింది.ముఖ్యంగా ఇళ్లల్లో వున్న ఆడవారికి టీవీ తప్పనిసరి.

 ఏరకమైన టీవీ వాడితే మంచిది? Qled, Uhd-TeluguStop.com

ఎందుకంటే ఇప్పుడున్న ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ లో భాగంగా భర్త జాబ్ కి వెళ్లిపోయిన తరువాత భారీ ఒక్కటే ఇంటిదగ్గర ఉండాల్సిన పరిస్థితి.ఇలాంటివారికి మరి టీవీనే కదా మంచి కాలక్షేపం.

అందుకే మనిషి అవసరాలనుబట్టి ఎప్పటికప్పుడు కస్టమర్లకు సో కాల్డ్ టీవీ కంపెనీలు అప్ డేటెడ్ వెర్సన్స్ ని మార్కెట్లో అందుబాటులో ఉంచుతాయి.ఈ క్రమంలో మనకు అనేక రకాల టీవీలు మార్కెట్లో అవేలబుల్ ఉన్నాయి.

ముఖ్యంగా ఈరోజుల్లో టీవీ పర్ఫార్మెన్స్‌ను వాటి డిస్‌ప్లేల ఆధారంగా నిర్ణయిస్తున్నారు.

వీటిలో ముఖ్యంగా QLED, UHD, OLED అనే డిస్‌ప్లే రకాలు కలవు.

అయితే ఈ మూడు రకాల డిస్‌ప్లే కలిగిన టీవీలు ఉన్నప్పటికీ ఏది ఎంచుకోవాలో ఒక క్లారిటీ ఉండాలి.ఒక్కో దాని వలన ఒక్కో సౌకర్యం కలదు.అదేమిటో ఇపుడు తెలుసుకుందాం.

QLED: QLED (క్వాంటం-డాట్ లైట్-ఎమిటింగ్ డయోడ్) డిస్‌ప్లే అనేది సాధారణ LED డిస్‌ప్లే లాగా పనిచేస్తుంది.QLED టెక్నాలజీని ఉపయోగించే డిస్‌ప్లేలు మంచి కలర్స్ ని అందిస్తాయి.QLEDని 2013లో సోనీ పరిచయం చేసినప్పటికీ, Samsung ఇప్పుడు QLED టీవీలను విక్రయిస్తోంది.LED డిస్‌ప్లేల మాదిరి కాకుండా వీటి ప్రభావం కాలక్రమేణా తగ్గే అవకాశం ఉండదు.

Telugu Oled, Qled, Ups-Latest News - Telugu

ఇక UHD (అల్ట్రా హై డెఫినిషన్) అనేది డిస్‌ప్లే టెక్నాలజీ రకం మాత్రం కాదు.ఇది అల్ట్రా హై డెఫినిషన్‌ని సూచిస్తుంది.ఇది 1080p లేదా 1,920 x 1,080, ఫుల్‌ HD కంటే ఎక్కువ రేంజ్‌ ఉంటుంది.

(UHD) దానిని నాలుగు రెట్లు పెంచి 3,840 x 2,160 రిజల్యూషన్‌గా చేస్తుంది.దీనిని 4K అని కూడా సూచిస్తారు.

OLED (ఆర్గానిక్ లైట్-ఎమిటింగ్ డయోడ్) అనేది ఎలక్ట్రిసిటీ ద్వారా టోస్టర్‌లోని హీటింగ్ ఎలిమెంట్‌తో సమానంగా మెరిసే పదార్థాన్ని ఉపయోగించి తయారు చేయడం జరిగింది.OLED డిస్‌ప్లే చాలా ముదురు నలుపు రంగులను అందిస్తుంది.

రోజుకు 6 గంటల పాటు TV చూస్తే, OLED TV జీవితకాలం దాదాపు 22 సంవత్సరాలు ఉంటుందని LG కంపెనీ ఇటీవల తెలిపింది.

Telugu Oled, Qled, Ups-Latest News - Telugu

QLED, UHDని సరి పోల్చలేం.ఎందుకంటే ఈ రెండు ఒకేలా ఉండవు.అయినప్పటికీ UHDని పూర్తి HD, QLED లేదా OLED వంటి ఇతర డిస్‌ప్లే రిజల్యూషన్‌లతో Neo QLED, QD-OLED, NanoCell వంటి ఇతర డిస్‌ప్లే టెక్నాలజీలతో పోల్చవచ్చు.

ఇలా అన్నింటినీ పోల్చి చూసినప్పుడు OLEDనే మెరుగ్గా ఉంటుంది.కాబట్టి ఎవరికి ఎలాంటి టీవీ కావాలో తెలుసుకొని కొనుక్కోవడం ఉత్తమైన నిర్ణయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube