Tollywood Movies: ఇలాంటి సినిమాలు తీసి సొసైటీ కి ఏం సందేశం ఇస్తున్నారు ?

డైలాగ్ చెప్పడానికి ఎంత బాగుంది.సినిమా తీస్తే జనాలకు సందేశం ఇవ్వాల్సిందేనా ? తీసిన ప్రతి సినిమా జనాలకు ఎదో ఒక మెస్సేజ్ ఇస్తుంది అనుకుంటే పొరపాటే.ఎవడు ఎలాంటి సినిమా తీసిన ఎవరికి కావాల్సింది వారు తీసుకుంటారు.ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలను చూస్తుంటే జనాలకు ఏం సందేశం ఇస్తున్నారు అనే సందేహం కలగక మానదు.

 What Kind Of Movies We Are Liking Details, Tollywood Movies, Sitaramam , Pushpa,-TeluguStop.com

ఒక సినిమా చూసే పనిషి పై చాల ప్రభావం చూపిస్తుంది.హీరో ఏం చేస్తే బయట యూత్ అదే చేయాలనీ అనుకుంటారు.ఈ మధ్య వచ్చిన పుష్ప సినిమా చూసాక అతడు చేస్తుంది నేరాలే అయినా తగ్గేదెలా అంటూ యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.అతడిని ఆదర్శం గా తీసుకుంటున్నారు చాల మంది.

ఇక సీతా రామం వంటి ఒక అద్భుతమైన ప్రేమ కథ వచ్చింది.మరి దీని నుంచి ఎంత మంది ఇన్స్పైర్ అయ్యారు.స్వచ్ఛమైన ప్రేమ కథను అందుకోవాలని, ఇవ్వాలని ఎంత మంది అనుకుంటున్నారు.మంచిని మంచిగా తీసుకోవాలని చూసే యూత్ కన్నా కూడా చెడుని తొందరగా ఒంట పట్టించుకునే వాళ్లే ఎక్కువ.

అందుకే మంచి సినిమాలు విజయవంతం అవ్వడం చాల కష్టం.హీరో హీరోయిన్ ని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతూ అక్కడ ఇక్కడ ముట్టుకుంటూ అమ్మాయి పెర్మిషన్ తో సంబందం లేకుండా హాగ్, కిస్ అంటూ వెంటపడితే అందరికి ఆ సినిమా నచ్చుతుంది.

Telugu Heroism, Dialogues, Pushpa, Sitaramam, Tollywood-Movie

కానీ విలువలు, నైతికత అంటూ సినిమాలు తీస్తే ఎంత మంది థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారు చెప్పండి.పైగా హీరో ఒక్కటే ఇరవై మంది విలన్ గ్యాంగ్ ని కొడితే కళ్ళు అప్పగించి మరి సినిమాలు చూస్తారు.ఒక గ్యాంగ్ ని వెనకేసుకొని అందర్నీ కొడితే అది హీరోయిజం.సినిమా అంటే ఖచ్చితంగా ఆరు పాటలు.నాలుగు ఫైట్స్ ఉండాల్సిందే.లేకపోతే మనకు నచ్చదు.

ఏవో అప్పుడప్పుడు సీతా రామం వంటి సినిమాలు విజయం సాధిస్తాయి కానీ అదే కోవలో కాస్త అటు ఇటు గా ఉన్న సినిమాలు అడ్డ్రస్సు లేకుండా పోయినవి చాలానే ఉన్నాయ్.ఇప్పటికి అయినా ప్రేక్షకుడి మేలుకో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube