వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..?

వర్షాకాలం ప్రారంభం కాగానే చాలా మంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతారు అయితే వర్షాకాలం రాగానే వాతావరణంలో మార్పులు ఒక్కసారిగా చోటు చేసుకుంటాయి.ఈ క్రమంలోనే ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాగానే జ్వరం దగ్గు జలుబు వంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

 What Kind Of Food Is Better To Take During Monsoon Season , Health Benifits , Health Tips , For Good Health , Herbal Tea , Honey , Genger ,during Monsoon Season , Herbale Tea-TeluguStop.com

కరోనా కూడా వచ్చే అవకాశం ఉండడంతో వర్షాకాలం ఈ వ్యాధి సోకే తీవ్రత ఎక్కువగా ఉంటుంది.మరి వర్షాకాలంలో ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందులో కొన్ని ఆహార పదార్థాలు దూరంగా ఉంటే మరీ మంచిది వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.

వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.ఏది పెడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ప్రధానంగా బయటి ఆహారం తీసుకోకపోవడం మంచిది.ఇంట్లో తయారు చేసుకునే ఆహారం తీసుకుంటే పలు ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు ఈ కాలంలో బజ్జీలు, వేడి వేడి పకోడీలంటి ఆహార పదార్థాలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.ముఖ్యంగా నూనెలో వేయించి ఆహార పదార్థాలను తగ్గించుకుంటే మంచిది అంటున్నారు వైద్య నిపుణులు.

 What Kind Of Food Is Better To Take During Monsoon Season , Health Benifits , Health Tips , For Good Health , Herbal Tea , Honey , Genger ,during Monsoon Season , Herbale Tea-వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేవిధంగా వర్షాకాలంలో ఆకుకూరలకు ఎక్కువగా బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక ఇన్ఫెక్షన్ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఆకుకూరలను తీసుకోకపోవడం మంచిది.

వర్షాకాలంలో హెర్బల్ టీ, కషాయాలను తాగడం ద్వారా మీ ఆరోగ్యానికి రోగనిరోధక శక్తి మరింత శక్తివంతంగా మెరుగుపడుతుంది.పసుపు తులసి అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క నీటిలో వేసి బాగా మరిగించి ఆ తర్వాత నిమ్మరసం తేనె కలుపుకుని తాగితే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చు.

ప్రతి సీజన్ లో అల్లం, వెల్లుల్లి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఔషధంలా ఉపయోగపడుతుంటాయి.ముఖ్యంగా అంటువ్యాధులతో పోరాడడానికి మంటను తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడతాయి అంతేకాకుండా నిమ్మకాయతో రోగనిరోధక శక్తిని కూడా అంతగా పెరుగుతుంది.వర్షాకాలంలో చల్లని పదార్థాలు సలాడ్స్, ఐస్క్రీమ్ తీసుకోవడం మంచిదంటు

మన ఇంటి ఆవరణ చుట్టూ ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంటి ఆవరణ చుట్టూ ఎక్కువగా నీరు నిల్వకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలి జాగ్రత్త తీసుకున్నప్పుడే  వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను మనం దరిచేరకుండా ఆపుకోవచ్చు.వర్షాకాలంలో చేపలు రొయ్యలు వంటి సముద్రపు ఆహార పదార్థాలను తీసుకోవడం మానేయాలి వర్షాకాలంలో ఎక్కువగా నీరు కలుషితం కావడం వల్ల చేపలు రొయ్యలను తీసుకోకపోవడంతో ఆ ప్రభావం మనపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ విధమైనటువంటి తనకు దూరంగా ఉంటే మీకే మంచిది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube