బ్లూ ఫిలిం చేయబోయిన టాప్ హీరోయిన్     2017-01-02   21:17:02  IST  Raghu V

బాలివుడ్ అగ్రకథానాయికలలో కంగనా రనౌత్ రూటే సపరేటు. పెద్ద గడుసరి. గట్స్ ఉన్న అమ్మాయి. ఏది దాచుకోదు. ఎవరి గురించైనా సరే, నిర్మొహమాటంగా చెప్పేసే కంగనా, తన గురించి కూడా అంతే, నిర్భయంగా మాట్లాడుతుంది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మొదట్లో అవకాశాల కోసం, సెక్సువల్ ప్లెజర్స్ ఇచ్చానని చెప్పి సంచలనం రేపిన కంగనా ఇప్పుడు తన జీవితంలో జరిగిన మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.

2006లో వచ్చిన గ్యాంగ్స్టర్ చిత్రంతో బాలివుడ్ లోకి ఎంట్రి ఇచ్చింది కంగనా. అప్పుడు ఆ చిత్రంలో అవకాశం రాకపోయుంటే, ఏకంగా ఒక బ్లూ ఫిలింలో నటించబోయిందట. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, టీనేజ్ లో ఉండగానే హీరోయిన్ కావాలనే ఆశయంతో ఇంట్లోంచి పారిపోయింది కంగనా.

ఒంటరిగా ముంబాయిలోకి అడుగుపెట్టింది. తిండిపెట్టేవారు కూడా లేరు. 17 ఏళ్ళ వయసులో ఓ బ్లూ ఫిలిం అవకాశం వచ్చిందట. ఆ సినిమాకి ఫోటోషూట్ కూడా చేసింది. అప్పుడే, అదృష్టం తలుపుతట్టి బాలివుడ్ లో చోటునిచ్చింది. అక్కడినుంచి కంగనా ఎదుగుదల ఒక పాఠం లాంటిది. అదే అవకాశం, ఆ సమయంలో రాకపోయింటే, ఆకలి కంగనాతో ఎలాంటి పనులు చేయించేదో!