ధోనిపై సంచలన వాఖ్యలు చేసిన ఇర్ఫాన్ పఠాన్  

What Is Wrong Between Irfan Pathan And Ms Dhoni - Telugu Cricket, Indian Cricket Team, Ipl, Irfan Pathan, Ms.dhoni, Team India

ఒకప్పటి టీం ఇండియా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.గతంలో తనకి ఎదురైన అనుభవాలని మీడియాతో పంచుకుంటున్నారు.

 What Is Wrong Between Irfan Pathan And Ms Dhoni

వరుసగా వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.తాజాగా ఓ స్పోర్ట్స్ యుట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ మీద విమర్శలు చేశాడు.భాగా రాణిస్తున్న కూడా తనను జట్టులో నుంచి కనీసం కారణం చెప్పకుండా ధోని తొలగించాడని నామ మాత్రపు మ్యాచ్‌లో కూడా ధోని అవకాశం ఇవ్వలేదని విమర్శించాడు.2008లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఇది జరిగిందని అన్నాడు.ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ వరుసగా మూడు వన్డేలు సాధించి సిరీస్‌ను గెలుచుకోగా, నాల్గో వన్డే వర్షార్పణం అయ్యిందనే విషయాన్ని ఇర్ఫాన్‌ గుర్తు చేశాడు.

తనకు ఐదో వన్డేలో అవకాశం ఇస్తారని ఎదురుచూసినా అది దక్కలేదన్నాడు.

ధోనిపై సంచలన వాఖ్యలు చేసిన ఇర్ఫాన్ పఠాన్-General-Telugu-Telugu Tollywood Photo Image

వన్డేకు తుది జట్టును ఎంపిక చేసే క్రమంలో ధోని మీడియాతో మాట్లాడుతూ ఇర్ఫాన్‌ బౌలింగ్‌ సరిగా లేకపోవడం వల్లే అవకాశం ఇవ్వలేదని చెప్పిన విషయం తనకు తీవ్ర కోపం తెప్పించిందన్నాడు.దీనిపై అప్పటి కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌తో మాట్లాడినట్లు తెలిపాడు.

కిర్‌స్టన్‌ చెప్పిన దానికి భిన్నంగా ధోని చెప్పడంతో ఈ విషయంపై అమీతుమీకి సిద్ధమైనట్లు తెలిపాడు.నేరుగా ధోని వద్దకే వెళ్లి క్లారిటీ అడిగినట్లు తెలిపాడు.

నా ప్రదర్శన బాగాలేని కారణంగా జట్టులో అవకాశం ఇవ్వలేదని చెప్పడం మీడియాలో రాద్దాంతం అవుతుంది అని అడిగేశా.దానికి ధోని బదులిస్తూ ప్రణాళికలో భాగంగానే నిన్ను తుది జట్టుకు దూరం పెట్టామని సింపుల్‌గా బదులిచ్చాడన్నాడు.

అయితే కిర్‌స్టన్‌ ఒకమాట, ధోని మరొక మాట చెప్పడం అవమానంగా ఫీల్ అయ్యానని అన్నాడు.అయితే ధోని ఏ ఉద్దేశ్యంతో అలా మాట్లాడాడో తనకి తెలియదని ఇర్ఫాన్ చెప్పాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

What Is Wrong Between Irfan Pathan And Ms Dhoni Related Telugu News,Photos/Pics,Images..

footer-test