ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నాలుగో విడత వారాహి యాత్ర కృష్ణాజిల్లాలో కొనసాగుతోంది.నిన్న జరిగిన నాలుగో విడత వారాహి యాత్ర మొదటి రోజున పవన్ ప్రసంగంపై జనసేన నాయకులతో పాటు, టిడిపి చాలా అంచనాలే పెట్టుకుంది.
కచ్చితంగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై విరుచుకుపడతారని, మూడు విడతల వారాహి యాత్రలో మాదిరిగానే పవన్ ఆవేశంతో వైసిపి( YCP ) ప్రభుత్వం పై విమర్శలు చేస్తారని టిడిపి జనసేన పొత్తు వ్యవహారం పైన మాట్లాడుతారని ఇలా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు .అయితే ఆశించిన స్థాయిలో పవన్ ప్రసంగం లేదనే నిట్టూర్పులు రెండు పార్టీల నేతల నుంచి వినిపిస్తున్నాయి.కౌరవులు, పాండవులు అనే డైలాగులు చెబుతూ , ప్రముఖ కవుల కొటేషన్లు ప్రస్తావిస్తూ పవన్ తను ప్రసంగాన్ని కొనసాగించారు.

పవన్ తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest )ను ఖండించలేదు.ఆయన తప్పు చేయలేదని కూడా చెప్పలేదు.దీంతో టీడీపీ శ్రేణులు నిరాశ వ్యక్తం చేశాయి.
దీంతో కొంతమంది పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారని, పవన్ వైసీపీ ప్రభుత్వం ఘాటుగా విమర్శలు చేస్తే ఆయనను వాలంటీర్స్ విషయంలో చేసిన కామెంట్స్ పై అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని భయపడ్డారని చర్చించుకుంటుండగా , రాజకీయ వర్గాల్లో మాత్రం పవన్ దూకుడుకు బిజెపి( BJP ) హై కమాండ్ బ్రేకులు వేసిందని , టిడిపి ,చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో దూకుడు తగ్గించాలని సూచించి ఉండవచ్చు అని , అందుకే పవన్ చాలా రోజులుగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో సైలెంట్ గా ఉంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవతున్నాయి.

పవన్ వారాహి యాత్రకు జనసేన నాయకులతో పాటు, టిడిపి నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మూడు విడతల్లో చేపట్టిన వారాహి యాత్రకు మంచి ఊపు వచ్చే లా ఆవేశంగా ప్రసంగాలు చేశారు .అయితే నాలుగో విడత యాత్రలో మాత్రం సాదాసీదాగా పవన్ ప్రసంగాలు ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.టిడిపి నాయకులు సైతం మారిన పవన్ వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.