ఈ బుడ్డోడి బౌలింగ్ ఇలా ఉందేంటి.. నేష‌న‌ల్ ప్లేయ‌ర్‌లా ఆడేస్తున్నాడే

ప్ర‌తిభ ఒక‌రి సొంతం కాదు.నేర్చుకుంటే రానిది రాదు.

 What Is This Buddy Bowling Like  Playing Like A National Player, Cricket, Buddy-TeluguStop.com

ప‌ట్టు ప‌ట్టాలే గానీ ఎవ్వ‌రైనా ఆకాశాన విహ‌రించ‌గ‌ల‌ర‌ని ఇప్ప‌టికే ఎంద‌రో నిరూపించారు.నేర్చుకోవాల‌నే త‌ప‌న ఉండాలే గానీ ఎంత‌టి ప‌నిని అయినా సుల‌భంగా చేసేయొచ్చు.

మ‌హా మ‌హులంతా ఇలాంటి హార్డ్ వ‌ర్క్ చేసిన వాళ్లే.అయితే ఇప్పుడు ఓ బుడ్డోడు కూడా ఇలాగే మెస్మరైజ్ చేస్తున్నాడు.

త‌న ట్యాలెంట్ తో అంద‌రినీ ఫిదా చేసేస్తున్నాడు.అత‌నికి క్రికెట్ మీద అంతలా క్రేజ్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

అత‌నికే కాదు క్రికెట్ అంటే మ‌న దేశంలో ప్ర‌తి ఒక్క‌రికీ ఓ చెప్ప‌లేని క్రేజ్.

అంద‌రిలాగే ఆ బుడ్డోడికి కూడా క్రికెట్ మీద అంత‌లా ప్రేమ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

అయితే తన ఇష్టాన్ని కార్య‌రూపంలోకి తీసుకొచ్చేశాడు.తానే త‌క్కువ కాద‌ని బాల్ పట్టుకుని త‌న స‌త్తా ఏంటో నిరూపించుకుంటున్నాడు.

తన బౌలింగ్‌తో ఎలా తిప్పినా వికెట్ల‌ను ప‌డ‌గొట్టేస్తున్నాడు.త‌న మాయాజాలంతో నెటిజన్లను మాయ చేస్తున్నాడ‌నే చెప్పాలేమో.

ఎదురుగా బ్యాటు ప‌ట్టుకున్న బ్యాట్స్‌మెన్లను త‌న అద్భుత‌మైన బ్యాటింగ్ తో భయబ్రాంతులకు గురిచేస్తున్నాడ‌నే చెప్పాలి.ఇందుకు సంబంధించిన వీడియో విప‌రీతంగా వైర‌ల్ గా మారిపోయింది.

ఇందులో ఓ బుడ్డోడు బాల్ తో అద్భుతంగా బౌలింగ్ వేయ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.మ‌నోడి బౌలింగ్‌కు క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను కూడా టెన్ష‌న్ ప‌డిపోతాడు.ఎటు నుంచి ఎటువైపుకు ఆ బాల్ తిరుగుతుందో అర్థం కాక చివ‌ర‌కు క్రీజు వదిలి ప‌క్కుకు త‌ప్పుకుంటాడు.మ‌నోడి స్పిన్‌ను చూస్తుంటే అచ్చం ర‌షీద్ ఖాన్‌లాగే అనిపిస్తున్నాడు.

ఇత‌ని బౌలింగ్‌ను చూసిన వారంతా కూడా ఇత‌ను పెద్ద‌య్యాక పెద్ద బౌల‌ర్ అవుతాడ‌ని కామెంట్లు పెడుతున్నారు.ఇంకొంద‌రేమో వెంట‌నే ఐపీఎల్ లో ఆడించాంటూ సూచ‌న‌లు కూడా చేస్తున్నారు.

ఇంకొంద‌రేమో అప్పుడే నేష‌న‌ల్ ప్లేయ‌ర్ లా ఆడేస్తున్నాడంటూ ప్ర‌శంసిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube