ఏందయ్యా ఇది, మేకల అటెండెన్స్ తీసుకుంటున్న మహిళ.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.కొందరు క్రియేటివిటీతో ఫన్నీ కంటెంట్ క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల వేదికగా వదులుతుంటారు.

 What Is This, A Woman Taking Attendance Of Goats Video Viral , Viral Video, Late-TeluguStop.com

ఇవి చూసినప్పుడు పడిపడి నవ్వక ఒక తప్పదు.తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. @TheFigen_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఐదు లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.6 వేలకు పైగా లైకులు వందల్లో కామెంట్స్ వచ్చాయి.

ఈ వైరల్ వీడియోలో ఒక మహిళ పెన్ను, పుస్తకం పట్టుకొని అటెండెన్స్ తీసుకుంటున్న టీచర్ లాగా వ్యవహరించడం గమనించవచ్చు.ఆమె నిల్చున్న రోడ్డుపైనే కొన్ని మేకలు వరుసగా వెళ్తున్నాయి.సరిగ్గా అదే సమయంలో ఆమె ప్రియా, కీర్తి, భవాని, సౌమ్య, కార్తీక్, అరుణ్, వివేక్‌ అంటూ పేర్లు పిలుస్తుండగా మేకలు ( goats )ఎస్ టీచర్ అని అటెండెన్స్ ఇచ్చినట్లు “మే.” అంటున్నాయి.చూసేందుకు ఈ దృశ్యం చాలా ఫన్నీగా అనిపించింది.ఒక పేరు పిలవగానే ఒకటే మేక మే అనటం కూడా ఆశ్చర్యపరిచింది.నిజంగానే వాటికి పేర్లు పెట్టారా, తమ పేరు ప్రకారం అవి పలుకుతున్నాయా అనేది తెలియ రాలేదు.

ఈ వీడియో చూసి చాలామంది బాగా నవ్వుకుంటున్నారు.ఇట్స్ అమేజింగ్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.పాపం ఈమె టీచర్ కావాలనుకుంటే ఏమో అది కుదరక మేకలకు టీచర్ అయిందేమో అని ఇంకొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube